Page Loader
IMA: జ్వరం, దగ్గు, జలుబుకు యాంటీబయాటిక్స్ వాడొద్దని ఐఎంఏ హెచ్చరిక
జ్వరం, దగ్గు, జలుబుకు యాంటీబయాటిక్స్ వాడొద్దని ఐఎంఏ హెచ్చరిక

IMA: జ్వరం, దగ్గు, జలుబుకు యాంటీబయాటిక్స్ వాడొద్దని ఐఎంఏ హెచ్చరిక

వ్రాసిన వారు Stalin
Mar 04, 2023
05:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

సీజనల్‌గా వచ్చే దగ్గు వికారం, వాంతులు, గొంతు నొప్పి, జ్వరం, ఒళ్లు నొప్పులు, అతిసారం వంటి లక్షణాలను కలిగి ఉన్న రోగులకు యాంటీబయాటిక్స్ వాడొద్దని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) వైద్య నిపుణులను కోరింది. మూడు రోజుల తర్వాత జ్వరం తగ్గిపోతుందని, అయితే దగ్గు మూడు వారాల వరకు ఉంటుందని అసోసియేషన్ తెలిపింది. ఈ మధ్యకాలంలో దగ్గు వికారం, వాంతులు, గొంతు నొప్పి, జ్వరం కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ నమూమానాలను పరిశీలించిన ఎన్‌సీడీసీ, దీనికి H3N2 ఇన్ఫ్లుఎంజా వైరస్ కారణమని పేర్కొంది.

ఐఎంఏ

వాడకాన్ని నియంత్రించాలి, లేకుంటే అవసరం ఉన్నప్పుడు పనిచేయవు: ఐఎంఏ

ఎన్‌సీడీసీ నివేదకలను ప్రస్తావిస్తూ.. H3N2 ఇన్ఫ్లుఎంజా వైరస్ సోకితే జలుబు, దగ్గు రావడం సర్వసాధారణమని, రోగులకు యాంటీబయాటిక్స్ సూచించవద్దని, వ్యాధి లక్షణాలతో కూడిన చికిత్సను మాత్రమే అందించాలని వైద్య నిపుణులను ఐఎంఏ కోరింది. దగ్గు, జ్వరం, జలుబు కోసం ప్రజలు అథ్రెసిన్, అమోక్సిక్లావ్ వంటి యాంటీబయాటిక్స్‌ను విచ్చలవిడిగా వినియోగిస్తున్నట్లు ఐఎంఏ పేర్కొంది. వాటి వాడకాన్ని నియంత్రించాలని, లేకుంటే నిజంగా అవసరం ఉన్నప్పుడు సరిగా పనిచేయవని హెచ్చరించింది. అనేక ఇతర యాంటీబయాటిక్స్ కూడా దుర్వినియోగం అవుతున్నాయని, వాటిని వీలైనంత త్వరగా ఆపాల్సిన అవసరం ఉందని చెప్పింది.