Supreme Court: 'వారికి రెడ్‌కార్పెట్ పరచి స్వాగతం పలకలా ?'..? రోహింగ్యాల అక్రమ వలసలపై సుప్రీం
ఈ వార్తాకథనం ఏంటి
రోహింగ్యా శరణార్థుల అదృశ్యంపై దాఖలైన హేబియస్ కార్పస్ పిటిషన్‌ను పరిశీలిస్తూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దేశంలోకి అక్రమంగా చొరబడే వారికి ప్రత్యేక న్యాయ రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందా అని ధర్మాసనం ప్రశ్నించింది. రోహింగ్యాలు కనిపించడంలేదంటూ దాఖలైన పిటిషన్‌పై భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని బెంచ్ మంగళవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పిటిషనర్‌ను ఉద్దేశిస్తూ, "వారికి రెడ్ కార్పెట్ పరిచి స్వాగతం పలకమని మీరు కోరుకుంటున్నారా?" అని ప్రతిప్రశ్నించింది. రోహింగ్యాలు సొరంగ మార్గాల ద్వారా భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించి, ఆహారం, నివాసం వంటి హక్కులను డిమాండ్ చేస్తున్న అంశాన్ని కోర్టు ప్రస్తావించింది.
వివరాలు
ఉత్తర భారతదేశంలో అత్యంత సున్నితమైన సరిహద్దులు
అలాగే, "ఉత్తర భారతదేశంలో అత్యంత సున్నితమైన సరిహద్దులు ఉన్నాయి. చట్టవిరుద్ధంగా చొరబడేవారు దేశంలోకి ప్రవేశిస్తే వారిని ఇక్కడే ఉంచాల్సిన బాధ్యత మనపై ఉందా?" అంటూ ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ అంశంపై సమగ్రంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని తెలిపింది.