Cyclone Montha: 'మొంథా తుపాన్ కు' ఆ పేరు ఎలా వచ్చింది? ఏ దేశం పేరు పెట్టిందంటే?
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచవ్యాప్తంగా తరచూ ఉధృతమైన తుపాన్లు విరుచుకుపడి ప్రజల జీవితాలను తారుమారు చేస్తున్నాయి. భారతదేశంలోనూ తిత్లీ, హుద్‌హుద్ వంటి ప్రాణాంతక సైక్లోన్లు అనేక ప్రాంతాలను దెబ్బతీశాయి. తాజాగా వచ్చిన "మొంథా" తుపాను కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను ఆందోళనకు గురిచేస్తోంది. అయితే ఈ తుపానుకు ఆ పేరు ఎవరు పెట్టారు? దానికి అర్థమేంటి? అనే ప్రశ్నలు సహజంగానే కలుగుతాయి. తుపానులకు వింతగా అనిపించే పేర్లు ఎందుకు పెడతారో చాలా మందికి ఆసక్తి ఉంటుంది. వాస్తవానికి తుపానులకు పేరు పెట్టడం అంత సాదాసీది విషయం కాదు. ఇది సమాచారాన్ని సులభంగా చేరవేయడంలో, ప్రజల్లో అప్రమత్తత కలిగించడంలో, అలాగే రక్షణ చర్యలను సమన్వయపరచడంలో ఎంతో ప్రధానమైన పాత్ర పోషిస్తుంది.
వివరాలు
జాబితాలో భారత్ సహా 13 దేశాలు
ఉత్తర హిందూ మహాసముద్రంలో ఏర్పడిన "మొంథా" తుపానుకు పేరు థాయిలాండ్ సూచించింది. థాయ్ భాషలో "మొంథా" అంటే "సువాసన పండు" అని అర్థం. ఈ పేరు ప్రపంచ వాతావరణ సంస్థ (World Meteorological Organization - WMO) రూపొందించిన తుపానుల పేర్ల వ్యవస్థలో భాగంగా ఎంపికైంది. ఈ జాబితాలో భారత్ సహా 13 దేశాలు ఉంటాయి. వాటి సూచనల ఆధారంగా పేర్లు అక్షర క్రమంలో కేటాయించబడతాయి. తుపాను పేర్ల ఎంపిక ఒకే దేశం బాధ్యత కాదు.ఈ ప్రక్రియను ప్రాంతీయ హరికేన్ కేంద్రాల సమూహం పర్యవేక్షిస్తుంది. ఇవి WMO ఆధీనంలో పనిచేస్తాయి. ప్రతి కేంద్రం తమ పరిధిలోని సముద్ర ప్రాంతాల్లో ఏర్పడే తుఫానుల దిశ, వేగం, తీవ్రత వంటి వివరాలను నిరంతరం నమోదు చేస్తుంది.
వివరాలు
తుపానుకు పేరు నిర్ణయించేటప్పుడు కొన్ని నిబంధనలు
తుపానులకు పేర్లు ఇవ్వడం సుదీర్ఘంగా, క్రమబద్ధంగా జరుగుతుంది. ప్రతి సముద్ర ప్రాంతానికీ ప్రత్యేకమైన ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ప్రాంతీయ కేంద్రాలు ఉంటాయి. కొత్త తుఫాను ఉత్పత్తి అయినప్పుడు, ఆ కేంద్రం ముందుగా సిద్ధం చేసిన పేర్ల జాబితా నుండి ఒక పేరును ఎంచుకుంటుంది. ఈ జాబితా సంబంధిత దేశాలు సూచించిన పేర్లతో సిద్ధం అవుతుంది. కొత్త తుఫానులు వస్తున్నప్పుడు, ఆ క్రమంలో ఉన్న తదుపరి పేరును ఉపయోగిస్తారు. తుపానుకు పేరు నిర్ణయించేటప్పుడు కొన్ని నిబంధనలు పాటిస్తారు. పేరు పొడవుగా ఉండకూడదు,సులభంగా ఉచ్ఛరించగలిగేటటువంటి, గుర్తుంచుకోవడానికి వీలుగా ఉండాలి. అలాగే, ఏ వ్యక్తి, సమూహం లేదా మతానికి అవమానకరంగా ఉండకూడదు. ఈ నియమాల వల్ల ప్రజల్లో భయం లేకుండా తుపానును గుర్తించడంలో సౌలభ్యం కలుగుతుంది.
వివరాలు
తుపానుల పేర్ల విధానం ప్రపంచవ్యాప్తంగా ఒకే తీరులో, స్పష్టంగా ఉండేలా రూపొందించారు
ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) ఈ మొత్తం వ్యవస్థను ప్రామాణీకరించి, సమన్వయం చేసే బాధ్యత వహిస్తుంది. అన్ని ప్రాంతీయ కేంద్రాలు ఒకే విధమైన ప్రమాణాలను అనుసరిస్తున్నాయో లేదో అది పర్యవేక్షిస్తుంది. అందుకే తుపానుల పేర్ల విధానం ప్రపంచవ్యాప్తంగా ఒకే తీరులో, స్పష్టంగా ఉండేలా రూపొందించబడింది. తుపానులకు పేర్లు ఇవ్వడం ఒక చిన్న చర్యలా అనిపించినా, ఇది వాస్తవానికి విపత్తు నిర్వహణలో కీలక భాగం. ఎందుకంటే, దీని ద్వారా ప్రజలు తక్షణమే సమాచారం తెలుసుకుని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవచ్చు, అధికారులు రక్షణ చర్యలను వేగంగా సమన్వయం చేయగలరు.