
Dogs attack- Infant killed: ఆడుకుంటున్నబాలికపై కుక్కల దాడి ...చిన్నారి మృతి
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్ లో దారుణం చోటుచేసుకుంది.
ఇంటిముందు ఆడుకుంటున్న రెండున్నరేళ్ల బాలిక పై వీధికుక్కలు దాడి చేశాయి.
ఈ దాడిలో తీవ్ర గాయాలైన ఆ చిన్నారి మృతి చెందింది.
నగరంలోని పేట్ బషీర్ బాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి.
ఛత్తీస్ గఢ్ రాష్ట్రం బిలాస్ పూర్ జిల్లా కొప్రా గ్రామానికి చెందిన విశ్వప్రసాద్, పుష్పాబాయి దంపతులు ఇక్కడకు వలస వచ్చి కొద్దికాలంగా ఓ నిర్మాణ సంస్థలో వలస కూలీలుగా పనిచేస్తున్నారు.
వీరికి రెండున్నరేళ్ల దీపాళీ అనే కూతురు ఉంది.
శుక్రవారం యధావిధిగా విశ్వప్రసాద్, పుష్పాబాయి దంపతులు పనికి వెళ్లిపోయారు.
సాయంత్రం తోటిపిల్లలతో దీపాళీ ఆడుకుంటుండగా ఓ రెండు వీధి కుక్కలు దీపాళీపై దాడి చేసి కరిచాయి.
Dog attack-Hyderabad
ఆస్పత్రికి తీసుకెళ్లే లోపే చనిపోయింది
దీపాళీ తల, చేతులకు తీవ్ర గాయాలు చేసి కొద్దిదూరం ఈడ్చుకెళ్లిపోయాయి.
ఈ రెండు కుక్కలకు మరో రెండు శునకాలు తోడై విపరీతం గా దాడి చేశాయి.
దీంతో మిగతా పిల్లలు భయపడి అక్కడ్నుంచి పారిపోయారు.
గాయడిన చిన్నారిని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా....పరిస్థితి విషమంగా మారడంతో అక్కడి వైద్యులు నిలోఫర్ ఆ సుపత్రికి రిఫర్ చేశారు.
అక్కడకు తీసుకెళ్లగా అప్పటికే బాలిక మృతి చెందింది.
దీంతో బాలిక తల్లిదండ్రులు శోక సంద్రంలో మునిగిపోయారు.
వీధికుక్కలు దాడులు చేస్తున్న అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.