నల్లరంగు దుస్తులు ధరించవద్దు.. మోదీ పర్యటనతో ఢిల్లీ యూనివర్సిటీలో ఆంక్షలు
ముఖ్యమంత్రి, ప్రధానమంత్రుల పర్యటన సందర్భంగా ట్రాఫిక్ అంక్షలు విధించడం సర్వసాధారణం. కానీ ఢిల్లీ యూనివర్సటీ శతాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా ప్రధాని మోడీ వస్తున్నారు. ఈ నేపథ్యంలో యూనివర్శిటీ అధికారులు ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా విద్యార్థులు గానీ, ఉద్యోగులు, సిబ్బంది ఎవరూ కూడా నల్లరంగు దుస్తులు వేసుకోకూడదని ప్రత్యేకంగా అదేశాలు జారీ చేశారు. అయితే నల్లరంగు దుస్తులు ధరిస్తే ప్రధాని మోదీ పర్యటనకు నిరసన తెలిపినట్లు అవుతుందని, అందుకే అధికారులు ఇలాంటి నిర్ణయాన్ని తీసుకున్నట్లు విద్యార్థి సంఘాల నేతలు చెబుతున్నారు. ఇదే విషయమై హిందూ కాలేజీ టీఆర్ ఇన్‌ఛార్జ్ ఇన్ చార్జీ మీను శ్రీవాత్సవ ఏడు పాయింట్లతో కూడిన ఓ నోటీసు విడుదల చేశారు.
విద్యార్థులకు అదనంగా ఐదు రోజులు అటెండెన్స్!
ఆ నోటీసులో విద్యార్థులు ఐడీ కార్డు ధరించాలని, నలుపురంగు దుస్తులు వేసుకోకూడదని , అదే విధంగా విద్యార్థుల తప్పనసరి హాజరు, హజరైన వారికి అదనంగా ఐదు రోజుల అటెండెన్స్ వేస్తామని చెప్పారు. ఈ విషయంపై కాలేజీ అధికారులను ప్రశ్నించగా తాము ఎలాంటి నోటీసులు జారీ చేయలేదని వెల్లడించారు. గతంలో తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్‌రవి పాల్గొనే సమావేశంలో నల్ల దస్తులు, సెల్ ఫోన్లు తీసుకురావద్దని పెరియార్ యూనివర్సిటీ ఈ నెల 24న అదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. గత బుధవారం సేలం జిల్లాలోని యూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమానికి గవర్నర్ విచ్చేశారు.