NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Delhi: ఢిల్లీలో పాఠశాలకు మళ్లీ బాంబు బెదిరింపు.. డిసెంబర్‌లో నాల్గవ కేసు
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Delhi: ఢిల్లీలో పాఠశాలకు మళ్లీ బాంబు బెదిరింపు.. డిసెంబర్‌లో నాల్గవ కేసు
    ఢిల్లీలో పాఠశాలకు మళ్లీ బాంబు బెదిరింపు.. డిసెంబర్‌లో నాల్గవ కేసు

    Delhi: ఢిల్లీలో పాఠశాలకు మళ్లీ బాంబు బెదిరింపు.. డిసెంబర్‌లో నాల్గవ కేసు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 20, 2024
    10:50 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దిల్లీ పాఠశాలలపై బెదిరింపుల ప్రక్రియ ఆగడం లేదు. శుక్రవారం ద్వారకలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (డీపీఎస్)కి మరోసారి బాంబు బెదిరింపు వచ్చింది.

    గురువారం రాత్రి పాఠశాల యాజమాన్యాన్ని ఈమెయిల్ ద్వారా బెదిరించారు. ఉదయం ఈ విషయం తెలుసుకున్న యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించి పాఠశాలలో తరగతులను నిలిపివేశారు.

    పోలీసులు విచారణలో పాఠశాల ఆవరణలో అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది.

    వివరాలు 

    ఆన్‌లైన్‌లో తరగతులు  

    బెదిరింపు రావడంతో, పాఠశాల ఆన్‌లైన్‌లో తరగతులు నిర్వహించాలని నిర్ణయించింది. ఈమెయిల్ పంపిన వారి సమాచారాన్ని పోలీసులు సేకరిస్తున్నారు.

    మంగళవారం తెల్లవారుజామున ఇండియన్ పబ్లిక్ స్కూల్, దిల్షాద్ గార్డెన్ పబ్లిక్ స్కూల్‌లకు బెదిరింపులు వచ్చాయి. పోలీసులు పాఠశాలలో 2 గంటల పాటు వెతికినా ఏమీ దొరకలేదు.

    ఈమెయిల్ ద్వారా రెండు పాఠశాలలకు బెదిరింపు లేఖలు కూడా పంపారు. నిరంతర బెదిరింపుల కారణంగా తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందుతున్నారు.

    వివరాలు 

    డిసెంబర్ 8 నుంచి బెదిరింపులు కొనసాగుతున్నాయి 

    డిసెంబరు 8న ఢిల్లీలోని 44 పాఠశాలలకు బెదిరిస్తూ US$30,000 డిమాండ్ చేస్తూ ఇమెయిల్ పంపబడింది.

    దీని తర్వాత డిసెంబర్ 13న 16 పాఠశాలలకు బెదిరింపులు వచ్చాయి. ఆ తర్వాత డిసెంబర్ 16న 20 స్కూళ్లపై బాంబులు వేస్తామని బెదిరింపులు వచ్చాయి.

    వీటిలో ఏ పాఠశాలలోనూ బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని ఢిల్లీ పోలీసులు గుర్తించలేకపోయారు. కొన్ని వారాల క్రితం, ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) పాఠశాల సమీపంలో పేలుడు సంభవించింది.

    Embed

    డీపీఎస్ కి మరోసారి బాంబు బెదిరింపు

    #WATCH | A private school in Delhi's Dwarka area recieved bomb threats this morning. Emergency response teams have been sent to the spot. Classes have been shifted to Online mode: Delhi Police More details awaited (Visuals from outside the school) pic.twitter.com/MP67VfLQ5y— ANI (@ANI) December 20, 2024

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ
    బాంబు బెదిరింపు

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    దిల్లీ

    Delhi Pollution: దిల్లీలో దట్టమైన పొగమంచు.. 100కు పైగా విమానాలు ఆలస్యం  వాయు కాలుష్యం
    Delhi Air Pollution: దిల్లీ వాయుకాలుష్యంపై సీఏక్యూఎం తీవ్ర ఆందోళన.. బడులు మొత్తం ఆన్‌లైన్‌లోనే.. నేటి నుంచి ట్రక్కులు బంద్‌ భారతదేశం
    Delhi Pollution: దిల్లీ గాలి నాణ్యత క్షీణిత.. సుప్రీంకోర్టు ఆప్ సర్కార్ పై ప్రశ్నలు! సుప్రీంకోర్టు
    Delhi Air Pollution: ప్రమాదకరస్థాయికి దేశ రాజధాని ఢిల్లీ వాయుకాలుష్యం.. ఈ సీజన్‌లో ఇదే అత్యధికం భారతదేశం

    బాంబు బెదిరింపు

    Hoax bomb: దుబాయ్ కి వెళ్లే విమానానికి బాంబు బెదిరింపు.. కస్టడీలో 13 ఏళ్ల బాలుడు  భారతదేశం
    Jammu-Jodhpur Train: జమ్మూ-జోధ్‌పూర్ రైలుకి బాంబు బెదిరింపు.. పంజాబ్ లో రైలు నిలిపివేత  భారతదేశం
    Bomb Threat: బెంగళూరులోని 'తాజ్ వెస్ట్ ఎండ్' హోటల్‌కు బాంబు బెదిరింపు.. క్షుణ్ణంగా తనిఖీలు బెంగళూరు
    Tamil Nadu: మదురైలోని పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు..   తమిళనాడు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025