LOADING...
Drugs: సనత్‌నగర్‌ బస్టాండ్‌లో డ్రగ్స్‌ కలకలం.. ఐదుగురిని అరెస్ట్ చేసిన ఎస్‌ఓటీ 
సనత్‌నగర్‌ బస్టాండ్‌లో డ్రగ్స్‌ కలకలం.. ఐదుగురిని అరెస్ట్ చేసిన ఎస్‌ఓటీ

Drugs: సనత్‌నగర్‌ బస్టాండ్‌లో డ్రగ్స్‌ కలకలం.. ఐదుగురిని అరెస్ట్ చేసిన ఎస్‌ఓటీ 

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 10, 2024
04:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్ సీటీలో విచ్చలవిడిగా డ్రగ్స్ దొరుకుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఫోకస్ పెట్టింది. డ్రగ్స్ అరికట్టేందుకు పోలీస్ అధికారులను అలర్ట్ చేసింది. డ్రగ్స్ సరఫరా చేసే నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. తాజాగా బుధవారం సనత్‌నగర్‌ బస్టాండ్‌లో డ్రగ్స్‌ కలిగి ఉన్న ఐదుగురిని సైబరాబాద్‌ ఎస్‌ఓటీ పోలీసులు పట్టుకున్నారు. మొత్తం రూ.2 లక్షల విలువైన ఎండీఎంఏ,గంజాయి,ఓసీబీ రోలింగ్ పేపర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వ్యక్తులు బంజారాహిల్స్‌కు చెందిన వి.నాగరాజు, సి.హెచ్.గణేష్, ఎం.భరత్, సాయి దిలీప్, ఎం.గౌతమ్ గా గుర్తించారు.

Details 

బర్త్‌డే పార్టీ కోసం గోవా నుండి డ్రగ్స్ 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగరాజు గోవాలోని ఓ డీలర్‌ నుంచి డ్రగ్స్‌ కొనుగోలు చేసి బర్త్‌డే పార్టీ కోసం ప్రైవేట్‌ బస్సుల్లో హైదరాబాద్‌కు తరలించాడు. పక్కా సమాచారం మేరకు ఎస్‌ఓటీ వారు డ్రగ్స్‌తో పాటు వారిని పట్టుకుని తదుపరి చర్యల నిమిత్తం సనత్‌నగర్ పోలీసులకు అప్పగించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

హైదరాబాద్ లో డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు!