Page Loader
DSC Notiification: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. సంక్రాంతి తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్
DSC Notiification: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. సంక్రాంతి తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్

DSC Notiification: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. సంక్రాంతి తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్

వ్రాసిన వారు Stalin
Jan 13, 2024
09:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

DSC Notiification: సంక్రాంతి పండగ వేళ.. ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. డీఎస్సీ ఎప్పుడు నిర్వహిస్తామనే దానిపై స్పష్టత ఇచ్చింది. సంక్రాంతి తర్వాత ఏపీలో డీఎస్సీ నోటిఫికేషన్‌‌ను విడుదల చేయనన్నట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. డీఎస్సీకి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని పేర్కొన్నారు. ఎన్ని పోస్టులు ఉంటాయి, విధి, విధానాలు ఏంటి అనే దానిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. అలాగే, ఎమ్మెల్యే, ఎంపీ సీట్ల మార్పులపై శనివారం 4వ లిస్టు విడుదల అవుతుందన్న ప్రచారాలపై కూడా బొత్స స్పందించారు. అవన్నీ అసత్య ప్రచారంగా పేర్కొన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

 మంత్రి బొత్స సత్యనారాయణ ట్వీట్