Mpox Cases In India: దుబాయ్తి నుంచి తిరిగి వచ్చిన వ్యక్తికి మంకీపాక్స్.. కర్ణాటకలో కేసు నమోదు..
ఈ వార్తాకథనం ఏంటి
భారతదేశంలో తాజాగా మరో మంకీపాక్స్ (mpox) కేసు నమోదైంది. దుబాయ్ నుండి భారతదేశానికి వచ్చిన ఒక ప్రయాణికుడిలో మంకీ పాక్స్ లక్షణాలు కన్పించాయి.
జనవరి 17న, బాధితుడు దుబాయ్ నుండి కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరు నగరానికి వచ్చాడు.
వచ్చిన కొద్ది రోజులకే శరీరంపై దద్దుర్లు, జ్వరంతో పాటు ఇతర మంకీ పాక్స్ లక్షణాలు కనిపించాయి.
వెంటనే, అతడు అత్యవసర చికిత్స కోసం ఒక ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లాడు.
ఆ ఆసుపత్రి వైద్యులు అతడి లక్షణాలను పరిశీలించి, కర్ణాటక వైద్య ఆరోగ్య శాఖకు సమాచారం అందించారు.
వివరాలు
ఐసోలేషన్ వార్డులో బాధితుడు, కుటుంబ సభ్యులు
వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమై, బాధితుని రక్త నమూనాలను సేకరించి పూణేలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్‌కు పంపించారు.
ల్యాబ్‌లో జరిగిన పరీక్షల తర్వాత అతనికి మంకీ పాక్స్ సోకినట్లు తేలింది.
ప్రస్తుతం, బాధితుడు అతని కుటుంబ సభ్యులను ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
మంకీ పాక్స్ కేసు నమోదు కావడంతో, వైద్యులు స్పందిస్తూ, "కోవిడ్-19తో పోల్చుకుంటే, మంకీ పాక్స్ ప్రమాదం చాలా తక్కువ. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎయిర్‌పోర్టులో మంకీ పాక్స్ సోకిన బాధితునితో సామీప్యం ఉన్న వారిని ఐసోలేషన్ వార్డుకు తరలించాం. త్వరలో వారిని డిశ్చార్జ్ చేస్తాము" అని తెలిపారు.