తదుపరి వార్తా కథనం

IndiGo flight: కోల్‌కతా వెళ్తుండగా ఇండిగో విమానంలో సాంకేతిక లోపం.. తిరిగి జైపూర్‌కే మళ్లింపు
వ్రాసిన వారు
Sirish Praharaju
Jan 23, 2024
12:00 pm
ఈ వార్తాకథనం ఏంటి
జైపూర్ నుండి కోల్‌కతాకు వస్తున్న ఇండిగో విమానం సాంకేతిక లోపం కారణంగా సోమవారం జైపూర్‌కు తిరిగి వచ్చిందని విమానయాన సంస్థ తెలిపింది.
6E784 అనే విమానం కోల్‌కతాకు వెళుతుండగా సాంకేతిక లోపాన్ని గుర్తించారు. సమస్యను గుర్తించిన వెంటనే ఈ విషయాన్ని పైలట్ ఏటీసీకి తెలియజేసి అత్యవసర ల్యాండింగ్‌కు అనుమతి కోరారు.
దాంతో విమానం జైపూర్ లో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. తదుపరి పరీక్షల అనంతరం తిరిగి ప్రయాణానికి సిద్ధమవుతుంది' అని ఇండిగో ప్రతినిధి తాజా ప్రకటనలోపేర్కొన్నారు.
ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయ విమానాన్ని ఏర్పాటు చేశారు.
జైపూర్-కోల్‌కతా విమానంలో అసౌకర్యానికి గురైనందుకు ఇండిగో ప్రయాణీకులకు క్షమాపణలు చెప్పినట్లు ఇండిగో ప్రతినిధి తెలిపారు.