
Indian Railway: భారీ వర్షాల ధాటికి తెలంగాణలో రైలు రవాణా అస్తవ్యస్తం
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.
ముఖ్యంగా మహబూబాబాద్ సమీపంలో అయోధ్య గ్రామంలో ఉన్న చెరువు కట్ట తెగిపోవడంతో, రైలు రవాణాకు ఇబ్బందిగా మారింది.
విజయవాడ-కాజీపేట మార్గంలో పలు రైళ్లు నిలిచిపోయాయి. ఇక ఇంటికన్నె-కేసముద్రం మధ్య రైల్వే ట్రాక్ ధ్వంసమైంది.
మరోవైపు మహబూబాబాద్ శివారులో రైలుపట్టాలపై వరదనీరు ప్రవహిస్తూ, ఎగువ, దిగువ రైలు మార్గాల్లో కంకరలు కొట్టుకుపోయాయి.
Details
నాలుగు గంటల పాటు నిలిచిపోయిన మహబూబ్‌నగర్-విశాఖ ఎక్స్‌ప్రెస్
ఇటువంటి పరిస్థితుల్లో, మచిలీపట్నం, సింహపురి ఎక్స్‌ప్రెస్ రైళ్లు మహబూబాబాద్ రైల్వే స్టేషన్‌లో నిలిపివేయాల్సి వచ్చింది.
తాళ్లపూసలపల్లి వద్ద కూడా రైల్వే ట్రాక్‌ను వరద నీరు తాకడంతో, పందిళ్లపల్లి వద్ద మహబూబ్‌నగర్-విశాఖ ఎక్స్‌ప్రెస్ రైలు దాదాపు 4 గంటలపాటు నిలిచిపోయింది.
వర్షాల ధాటికి రవాణా వ్యవస్థ దెబ్బతినడంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.