Schools shut: చలి ఎఫెక్ట్.. 5వ తరగతి వరకు పాఠశాలల మూసివేత
ఈ వార్తాకథనం ఏంటి
తీవ్రమైన చలి కారణంగా నర్సరీ నుంచి 5వ తరగతి వరకు పాఠశాలలు రాబోయే 5 రోజుల పాటు మూసివేయనున్నట్లు దిల్లీ ప్రభుత్వం పేర్కొంది.
ఈ మేరకు దిల్లీ విద్యాశాఖ మంత్రి అతిషి ఆదివారం ట్విట్టర్(ఎక్స్) వేదికగా వెల్లడించారు.
దిల్లీలో కొనసాగుతున్న తీవ్రమైన చలి నేపథ్యంల అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో శీతాకాల సెలవులను జనవరి 12 వరకు పొడిగించారు.
వాస్తవానికి దిల్లీలో శీతాకాలం సెలవులు శనివారంతో ముగిశాయి. చలి తగ్గకపోవడంతో సెలవులను మరో ఐదు రోజుల పాటు పొడిగిస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి వెల్లడించారు.
దిల్లీలో చలిగాలులు, దట్టమైన పొగమంచు కారణంగా రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉంది. దీంతో ఐఎండీ 'ఎల్లో అలర్ట్' జారీ చేసింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
విద్యాశాఖ మంత్రి అతిషి ట్వీట్
Schools in Delhi will remain closed for the next 5 days due to the prevailing cold weather conditions, for students from Nursery to Class 5.
— Atishi (@AtishiAAP) January 7, 2024