Garib Rath Express: బారాబంకిలో తప్పిన భారీ రైలు ప్రమాదం.. రైల్వే ట్రాక్‌పై పడ్డ డంపర్
ఈ వార్తాకథనం ఏంటి
ఉత్తర్‌ప్రదేశ్‌లో బారాబంకి ప్రాంతంలో భారీ రైలు ప్రమాదం తృటిలో తప్పింది. రామ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక డంపర్ ట్రక్ వంతెన రైల్వే రైలు మార్గాన్ని ఢీ కొట్టి, రైలు ట్రాక్‌లపై పడిపోయింది. పక్కనే మరో మార్గంలో అమృత్‌సర్-బిహార్ గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ తృటిలో వెళ్తున్నది. రైలుకు ఎలాంటి ప్రమాదం కాకపోవడంతో భారీ పెను ప్రమాదం తప్పినట్లయ్యింది సమాచారం అందగానే పోలీసులు, రైల్వే అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. వాహనంలో చిక్కుకుపోయిన డ్రైవర్‌ను రేస్క్యూ ఆపరేషన్ ద్వారా బయటకు తీశారు, తక్షణమే ఆసుపత్రికి తరలించారు.
వివరాలు
ట్రాక్‌పై డంపర్.. రైళ్ల రాకపోకలకు అంతరాయం
బారాబంకి పోలీస్ సూపరింటెండెంట్ అర్పిత్ విజయవర్గియా మాట్లాడుతూ, "డంపర్ లోపల డ్రైవర్ చిక్కుకుపోయాడు. పోలీసులు, రైల్వే అధికారులు, ఇతర విభాగాల సహాయంతో అతన్ని రక్షించి ఆసుపత్రికి తరలించాము" అని తెలిపారు. ట్రాక్‌పై డంపర్ పడిపోవడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రమాదం తర్వాత ఒక ప్రాసింజర్ రైలు కూడా ఆ మార్గంలో నిలిచిపోయింది, దాన్ని తరలించడానికి ప్రత్యామ్నాయ ఇంజిన్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రైలు సురక్షితంగా ఉందని.. ట్రక్కు సమీపంలోని లైన్‌పై పడిపోయిందన్నారు. ట్రాక్‌ను పూర్తిగా తనిఖీ చేసిన తర్వాత రైల్ల రాకపోకలు పునరుద్ధరించబడతాయని చెప్పారు. ప్రస్తుతం ఈ ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
రైల్వే ట్రాక్‌పై పడ్డ డంపర్.
बाराबंकी जिले के रामनगर-फतेहपुर मार्ग पर कल रात में बड़ा हादसा होते-होते टला बुढ़वल जंक्शन के पास स्थित पुल पर तेज रफ्तार में आ रहा लोडेड डंपर अचानक अनियंत्रित होकर रेलिंग तोड़ते हुए सीधे रेलवे ट्रैक पर जा गिरा, जहां से अमृतसर जा रही गरीब रथ एक्सप्रेस के बोगी G2 क्षतिग्रस्त हो… pic.twitter.com/VHveZ0itWb
— Barabanki News (@BBKNews) November 27, 2025