Page Loader
దిల్లీ: సనాతన ధర్మాన్ని అవమానించిన వారి దిష్టిబొమ్మల తొలగింపు
దిల్లీ: సనాతన ధర్మాన్ని అవమానించిన వారి దిష్టిబొమ్మల తొలగింపు

దిల్లీ: సనాతన ధర్మాన్ని అవమానించిన వారి దిష్టిబొమ్మల తొలగింపు

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 24, 2023
08:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

దసరా అనేది హిందువుల పండుగ. ఇది చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక. ప్రతి సంవత్సరం,దుష్టత్వంపై ధర్మం సాధించిన విజయానికి గుర్తుగా దేశవ్యాప్తంగా అనేక ప్రదేశాలలో రావణుడు,మేఘనాథుడు,కుంభకర్ణుడు లాంటి వేలాది దిష్టిబొమ్మలను దహనం చేస్తారు. దిల్లీలో రామలీలాల సందర్భంగా అవినీతి, మాదక ద్రవ్యాల దుర్వినియోగం వంటి సామాజిక సమస్యలకు సంబంధించిన దిష్టిబొమ్మలను దహనం చేయడం చాలా కాలంగా వస్తున్న ఆచారం. అయితే, ఇటీవల స‌నాత‌న ధ‌ర్మంపై త‌మిళ‌నాడు మంత్రి ఉద‌య‌నిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్య‌లు పెను దుమారాన్ని రేప‌డంతో బాటుగా దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌కు దారితీసిన విషయం తెలిసిందే. అందుకని ఈ ఏడాది సనాతన ధర్మాన్ని అవమానించిన వారి దిష్టిబొమ్మలను దసరా వేడుకల కోసం ఢిల్లీలోని ఎర్రకోట మైదానంలో ఏర్పాటు చేశారు.

Details 

రావ‌ణ ద‌హ‌నం కార్యక్రమానికి ప్రముఖులు 

ఆ దిష్టి బొమ్మల మెడకు పాదరక్షల దండలు చుట్టి దానిపై 'సనాతన ధర్మంపై దాడి చేసేవారిని తరిమికొట్టండి'అనే నినాదాలతో కూడిన పోస్టర్లను అతికించారు. ఢిల్లీలోని రామలీలా కార్యక్రమాలకు కేంద్ర సంస్థ అయిన శ్రీ రామలీలా మహాసంఘ్ అధ్యక్షుడు అర్జున్ కుమార్ ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ,"పురాణ విరోధుల విగ్రహాలు 80 నుండి 100 అడుగుల ఎత్తులో ఉంటాయని,అదే సనాతన ధర్మ వ్యతిరేకులకు ప్రాతినిధ్యం వహిస్తున్నవి 6 నుండి 15 అడుగుల వరకు ఉంటాయని తెలిపారు. ఈ రావ‌ణ ద‌హ‌నం కార్యక్రమానికి బాలీవుడ్ న‌టి కంగ‌నా ర‌నౌత్‌, ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్‌,ఎల్జీ వీకే స‌క్సేనా స‌హా ప‌లువురు ప్ర‌ముఖులు ముఖ్యఅతిధులుగా హాజరవుతున్న సంద‌ర్భంగా దిష్టిబొమ్మ‌ల‌పై స‌నాత‌న ధ‌ర్మ వ్య‌తిరేకుల లేబుల్స్‌ను అధికారులు తొల‌గించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సనాతన ధర్మాన్ని అవమానించిన వారి దిష్టిబొమ్మలు