Page Loader
Sharmishta Panoli: 22 ఏళ్ల న్యాయ విద్యార్థిని అరెస్ట్‌.. విడుదల చేయాలంటూ ప్రధాని మోదీని కోరిన డచ్ ఎంపీ
22 ఏళ్ల న్యాయ విద్యార్థిని అరెస్ట్‌.. విడుదల చేయాలంటూ ప్రధాని మోదీని కోరిన డచ్ ఎంపీ

Sharmishta Panoli: 22 ఏళ్ల న్యాయ విద్యార్థిని అరెస్ట్‌.. విడుదల చేయాలంటూ ప్రధాని మోదీని కోరిన డచ్ ఎంపీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 01, 2025
02:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

'ఆపరేషన్ సిందూర్' నేపథ్యంలో సోషల్‌ మీడియాలో పెట్టిన అభ్యంతరకర పోస్టు కారణంగా 22 ఏళ్ల న్యాయ విద్యార్థిని శర్మిష్ఠ పనోలీని కోల్‌కతా పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ అరెస్ట్‌ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఈ ఘటనపై నెదర్లాండ్‌కు చెందిన డచ్‌ పార్లమెంట్‌ సభ్యుడు గీర్ట్ వైల్డర్స్ స్పందించారు. సామాజిక మాధ్యమాల్లో చేసిన ఒక పోస్టు ఆధారంగా శర్మిష్ఠను అరెస్ట్‌ చేయడం సరైన చర్య కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇది భారతదేశంలో వాక్స్వేచ్ఛకు భంగం కలిగించే చర్యగా పేర్కొన్నారు. శర్మిష్ఠను శిక్షించకుండా వెంటనే విడుదల చేయాలని కోరుతూ భారత ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు.

Details

శర్మిష్ఠకు 14 రోజులు రిమాండ్

ఎంతో ధైర్యంగా వ్యవహరించిన శర్మిష్ఠకు తన మద్దతు తెలుపుతూ, ఆమె ఫోటోను సోషల్‌మీడియాలో షేర్‌ చేశారు. ఇక గతంలో బాలీవుడ్‌ నటులు 'ఆపరేషన్‌ సిందూర్‌'పై స్పందించలేదని ఆమె సోషల్‌ మీడియా వేదికగా విమర్శలు చేసిన వీడియో పోస్ట్‌ చేసింది. అయితే దానికి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో, ఆమె ఆ వీడియోను తొలగించి క్షమాపణలు కూడా కోరింది. అయినప్పటికీ పలువురు ఫిర్యాదు చేయడంతో కోల్‌కతా పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు. అనంతరం న్యాయస్థానంలో హాజరుపర్చగా, 14 రోజుల పాటు న్యాయ నిర్భందం విధిస్తూ కోర్టు ఉత్తర్వులిచ్చింది.