ఈ నెల 30నుంచే తెలంగాణ కొత్త సచివాలయంలో విధులు
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ నూతన సచివాలయంను ఏప్రిల్ 30న ఘనంగా ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
అయితే ప్రారంభించిన రోజు నుంచే నూతన సచివాలయంలో విధులు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వ కార్యదర్శి శాంతాకుమారి ఆదేశాలు జారీ చేశారు.
కొత్త సచివాలయంలోకి దస్త్రాల తరలింపుపై నిర్వహించిన సమావేశంలో సీఎస్ ఈ మేరకు స్పష్టం చేశారు.
ఈ క్రమంలో శాఖల వారీగా గదల కేటాయింపు ఉత్తర్వులను మంగళవారం ప్రభుత్వం విడుదల చేయనుంది.
తెలంగాణ
ప్రత్యేక హంగులతో కొత్త సచివాలయం నిర్మాణం
భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరు మీద ఏర్పాటు చేసిన సచివాలయాన్ని 30వ తేదీన(ఆదివారం) ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రారంభించనున్నారు.
కొత్త కాంప్లెక్స్ అద్భుతమైన ఇంటీరియర్ సహా అద్భుతమైన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రత్యేక హంగులతో కొత్త సచివాలయాన్ని ప్రభుత్వం నిర్మించింది.
సచివాలయ ప్రారంభోత్సవానికి సంబంధించిన పూజలను ఆదివారం 5గంటల నుంచే ప్రారంభమవుతాయి. మధ్యాహ్నం 1.10 గంటల సమయంలో నూతన సచివాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు.