Strong Tremors in Delhi : దిల్లీలో మరోసారి భూప్రకంపనలు..భయాందోళనలో ప్రజలు
దిల్లీ-ఎన్‌సీఆర్‌తో సహా ఉత్తర భారతదేశం ఒక్కసారిగా షేక్ అయ్యింది. సోమవారం మధ్యాహ్నం భారీ భూకంపం సంభవించింది. దేశంలోని ఉత్తరాది ప్రాంతాల్లో ప్రకంపనలు రావడం 3 రోజుల్లో ఇది రెండోసారి కావడం గమనార్హం. నవంబర్ 3న, శుక్రవారం 6.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీని కారణంగా నేపాల్ జాతీయ రాజధాని ప్రాంతం సహా ఉత్తర భారతదేశం అంతటా ప్రకంపనలు రేపింది. రాత్రి 11.32 గంటలకు భూమిలోపల ప్రకంపనలు రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఫలితంగా ఉన్నఫలంగా ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపం కారణంగా నేపాల్‌లో సుమారుగా 160 మంది మృత్యువాత పడ్డారు. 250 మందికిపైగా గాయాలపాలయ్యారు.