LOADING...
Earthquake: భారీ భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలు
భారీ భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలు

Earthquake: భారీ భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలు

వ్రాసిన వారు Moogati Shabari
Apr 03, 2026
10:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

శుక్రవారం దిల్లీ-ఎన్‌సిఆర్ ప్రాంతంతో పాటు ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో తీవ్ర భూకంప ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఈ సంఘటనతో ప్రజలు తీవ్ర భయానికి గురై తమ ఇళ్లను, కార్యాలయ భవనాలను వదిలి బయటకు పరుగులు తీశారు. రాత్రి సుమారు 9.50 గంటల సమయంలో నమోదైన ఈ ప్రకంపనలు పంజాబ్‌లోని నోయిడా, చండీగఢ్, లుధియానాలో చోటుచేసుకున్నాయి. అంతేకాకుండా జమ్ముకశ్మీర్‌లోని పూంచ్, శ్రీనగర్, ఉధంపూర్ వంటి పలు నగరాల్లో కూడా భూ ప్రకంపనలు జరిగాయి. ఎత్తైన భవనాల్లో నివసించే వారు భూకంపం కొన్ని సెకన్లపాటు కొనసాగిందని, ఇళ్లలోని వస్తువులు కదిలినట్లు తెలిపారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

దిల్లీలో భూప్రకంపనలు

Advertisement