Page Loader
దిల్లీ సహా ఉత్తర భారతంలోని పలు ప్రాంతాల్లో భారీ భూకంపం 

దిల్లీ సహా ఉత్తర భారతంలోని పలు ప్రాంతాల్లో భారీ భూకంపం 

వ్రాసిన వారు Stalin
Jun 13, 2023
04:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీతో పాటు ఉత్తర భారతంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం మధ్యాహ్నం భారీ భూకంపం సంభవించింది. మధ్యాహ్నం 1:30 గంటల తర్వాత భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై 5.4 తీవ్రత నమోదైనట్లు యూరోపియన్-మెడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్ వెల్లడించింది. జమ్ముకశ్మీర్‌లోని కిష్త్వార్‌కు ఆగ్నేయంగా 30 కిలోమీటర్ల దూరంలో భూకంపం వచ్చినట్లు తెలిపింది. భూకంపం 60కిమీ (37.28 మైళ్లు) లోతులో ఉందని, భూకంప కేంద్రం పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌కు ఉత్తరంగా 99 కిమీ దూరంలో 60కిమీ (37.28 మైళ్లు) లోతులో ఉందని ఉందని ఈఎంఎస్ సీ తెలిపింది. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు ఎలాంటి నివేదికలు అందలేదు. ఇళ్లలోని వస్తువులు ఒక్కసారిగా కదలడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఉత్తర భారతంలో కంపించిన భూమి