Page Loader
EC: కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు 
EC: కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు

EC: కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు 

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 21, 2024
02:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

లోక్‌సభ ఎన్నికల వేళ కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. వాట్సాప్‌లో 'వికసిత్ భారత్' సందేశాలను పంపడం ఆపివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. లోక్‌సభ 2024 ఎన్నికల తేదీలను ప్రకటించి,మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC) అమలులోకి వచ్చిన తర్వాత కూడా ప్రజల ఫోన్‌లకు సందేశాలు డెలివరీ అవుతున్నాయని ECకి అనేక ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో ఇలాంటి సందేశాలు పంపిచకూడదని స్పష్టం చేసింది. ఈ సందేశాలు ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందే పంపామని, నెట్‌వర్క్ సమస్య వల్ల ఇప్పుడు వస్తున్నాయని ఈసీకి కేంద్రం వివరణ ఇచ్చింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వాట్సాప్‌లో 'వికసిత్ భారత్' సందేశాలను పంపడం ఆపాలన్న ఈసీ