LOADING...
RV Karnan: బీఆర్ఎస్ బోగస్ ఓట్ల ఆరోపణలను ఖండించిన ఈసీ
బీఆర్ఎస్ బోగస్ ఓట్ల ఆరోపణలను ఖండించిన ఈసీ

RV Karnan: బీఆర్ఎస్ బోగస్ ఓట్ల ఆరోపణలను ఖండించిన ఈసీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 14, 2025
12:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

జూబ్లీహిల్స్‌లో ఓట్లు అధికంగా నమోదైనట్లు బీఆర్ఎస్ నేతల ఆరోపణలను హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ ఖండించారు. విచారణలో అక్రమాలు ఏమి జరగలేదని అధికారులు స్పష్టం చేశారు. వీధులపై బీఆర్ఎస్ నేతలు చేసిన ఫిర్యాదులో సూచించిన చిరునామాలు బహుళ అంతస్తుల అపార్ట్‌మెంట్‌లకు చెందినవని, ఒక్కో ఇంటి నంబర్‌లో ఉన్న ఫ్లాట్ల సంఖ్య ఎక్కువ కావడంతో ఓట్ల సంఖ్య ఎక్కువగా కనిపించిందని ఆయన తెలిపారు. ఉదాహరణగా, 8-3-231/B/118లో 50 మంది, 8-3-231/B/119లో 10 మంది, 8-3-231/B/164లో 8 మంది, 8-3-231/B/160లో 43 మంది ఓటర్లు ఉన్నారని, వారంతా ఫ్లాట్లలో నివసిస్తున్నవారే అని వివరించారు.

Details

సరైన చిరునామా ఆధారంగానే ఓటరు గుర్తింపు కార్డులు

అలాగే ఈ ఓటర్లు 2023 నుండి జాబితాలో ఉన్నారని, గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా తమ ఓటు హక్కును వినియోగించినారని ఆర్వీ కర్ణన్ చెప్పారు. సరైన చిరునామాల ఆధారంగానే వారికి ఓటరు గుర్తింపు కార్డులు జారీ చేశారని, ఇటీవల కొత్తగా ఒక్క ఓటు కూడా నమోదు కాలేదని స్పష్టం చేశారు. ఈ విచారణ ద్వారా బీఆర్ఎస్ నేతలు చేసిన ఆరోపణల్లో ఏ వాస్తవం లేదని తేలింది.