తదుపరి వార్తా కథనం
Andhrapradesh: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పనులకు ఈసీ అనుమతి
వ్రాసిన వారు
Sirish Praharaju
Feb 06, 2025
04:28 pm
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మాణ పనులకు సంబంధించి టెండర్లు పిలిచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) అనుమతిచ్చింది.
ప్రస్తుతం కృష్ణ-గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్నది.
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో, సీఆర్‌డీఏ పరిధిలో చేపట్టబోయే పనులపై అనుమతి కోసం సీఆర్‌డీఏ అధికారులు ఈసీకి ఇటీవల లేఖ రాశారు.
ఈ విషయంపై స్పందించిన ఈసీ, రాజధానిలో పనులకు ఎటువంటి అభ్యంతరం లేదని, టెండర్లు పిలిచేందుకు అనుమతి ఇచ్చినట్లు లేఖలో స్పష్టం చేసింది.
అయితే, ఎన్నికల ప్రక్రియ పూర్తైన తర్వాత మాత్రమే టెండర్లు ఖరారు చేయాలని పేర్కొంది.