
Assembly Elections: మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలకు నేడు షెడ్యూల్ ప్రకటన
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలో మరోసారి ఎన్నికల సైరెన్ మోగబోతోంది. మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం సర్వ సన్నద్ధంగా ఉంది.
ఈరోజు మధ్యాహ్నం 3.30 గంటలకు దీనిపై ప్రెస్ మీట్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.
మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఈ సమావేశంలో విడుదల కానుంది. మహారాష్ట్ర అసెంబ్లీ పదవీకాలం నవంబర్ 26న ముగియనుండగా, జార్ఖండ్ అసెంబ్లీ పదవీకాలం 2025 జనవరి 5న ముగుస్తుంది.
ఈ నేపథ్యంలో, ఈ రెండు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనున్నది.
షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి ఆ రాష్ట్రాల్లో సెక్షన్ 144 అమల్లోకి రానుంది. ఇటీవలే మరో రెండు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించనున్న భారత ఎన్నికల సంఘం
Election Commission of India to announce the schedule for General Election to Legislative Assemblies of Maharashtra and Jharkhand 2024.
— ANI (@ANI) October 15, 2024
ECI to hold a press conference at 3:30 PM today. pic.twitter.com/yehIR0qUsm