Telangana: తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు ఈసి అనుమతి
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇక దేశంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం సెలబ్రేషన్స్ లకు అనుమతి ఇవ్వాలంటూ ఎన్నికల సంఘాన్ని కోరింది. దీనిపై సానుకూలంగా స్పందించిన ఎన్నికల సంఘం జూన్ 2 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలను జరుపుకొవచ్చని తెలిపింది. ఈ నేపథ్యంలో ఈసీ అనుమతితో సీఎస్ శాంతకుమారి ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించనున్నట్లు సీఎస్ శాంతి కుమారి వెల్లడించారు. ఈ క్రమంలో.. జూన్ రెండవ తేదీ కార్యక్రమానికి ముందు సీఎం రేవంత్ రెడ్డి గన్‌పార్క్ దగ్గరకు వెళ్తారు.
తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు పెద్ద పండుగ ఇది
అక్కడ.. తెలంగాణ కోసం ప్రాణాలు త్యాగం చేసిన అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించనున్నారు. గన్ పార్క్ కార్యక్రమం తర్వాత ముఖ్యమంత్రి పరేడ్ గ్రౌండ్ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొంటారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇదిలా ఉండగా ప్రస్తుతం దేశంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ప్రభుత్వాలు ఎలాంటి పథకాలుకానీ, పథకం కోసం ప్రభుత్వం నుంచి నిధులు కేటాయించడం కానీ చేయకూడదు. ఎలాంటి ప్రభుత్వ పరంగా కార్యక్రమాలు చేయాల్సి ఉన్న ఈసీ అనుమతి తప్పనిసరి. ఈ క్రమంలో ఎలాగైనా ఉత్సవాలను ఎప్పటికి గుర్తుండిపోయేలా గ్రాండ్ గా నిర్వహించాలని కాంగ్రెస్ భావిస్తుంది. ఈ సమీక్షా సమావేశానికి డిజిపి రవి గుప్తా, విద్యుత్ శాఖతో సహా జిహెచ్ ఎంసి , ఇతర ముఖ్య అధికారులు హాజరయ్యారు.