Page Loader
Liquor Scam: లిక్కర్‌ స్కామ్‌ కేసు.. మాజీ సీఎం కుమారుడి అరెస్టు చేసిన ఈడీ  

Liquor Scam: లిక్కర్‌ స్కామ్‌ కేసు.. మాజీ సీఎం కుమారుడి అరెస్టు చేసిన ఈడీ  

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 18, 2025
01:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

లిక్కర్ స్కాం కేసులో ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ కుమారుడు చైతన్య భగేల్ (Chaitanya Baghel)ను నేడు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్ట్ చేశారు. దాదాపు రూ.2100 కోట్ల లిక్కర్ స్కాం‌తో సంబంధాలున్న మనీ లాండరింగ్ కేసులో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఇవాళ ఉదయం దుర్గ్ జిల్లాలోని భిలాయ్ పట్టణంలో ఉన్న చైతన్య భగేల్ నివాసంలో ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు.

వివరాలు 

చైతన్య భగేల్‌ను ఈడీ విచారించడం ఇది రెండోసారి

తనిఖీలు ముగిసిన అనంతరం ఆయన్ను అధికారులు అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు చైతన్య భగేల్‌ను ఈడీ విచారించడం ఇది రెండోసారి . లిక్కర్ స్కాం కేసులో తమకు తాజా ఆధారాలు లభించాయని ఈడీ అధికారులు వెల్లడించారు. అయితే అసెంబ్లీ సమావేశాల చివరి రోజునే ఈడీ తనిఖీలు జరగడంపై మాజీ సీఎం భూపేష్ భగేల్ విమర్శలు చేశారు. రాజకీయం నెపంతో తనను టార్గెట్ చేశారని ఆయన ఆరోపించారు. గతంలో, మార్చి 10వ తేదీన కూడా చైతన్య భగేల్ ఇంట్లో ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహించిన సంగతి తెలిసిందే.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మాజీ సీఎం కుమారుడి అరెస్టు చేసిన ఈడీ