Sanjeev Arora: మనీలాండరింగ్ కేసులో పంజాబ్ ఆప్ ఎంపీ నివాసంలో ఈడీ సోదాలు
ఈ వార్తాకథనం ఏంటి
ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) రాజ్యసభ ఎంపీ సంజీవ్ అరోఢా నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు సోదాలు నిర్వహించారు.
భూ అక్రమాల వ్యవహారానికి సంబంధించి మనీలాండరింగ్ కేసులో భాగంగా ఈ తనిఖీలు జరుగుతున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.
పంజాబ్‌లోని లూధియానాలో ఉన్న ఎంపీ నివాసం, కార్యాలయం,ఇతర వ్యక్తుల ఇళ్లలో ఈడీ అధికారులు సోమవారం ఉదయం నుంచి తనిఖీలు చేస్తున్నాయి.
వివరాలు
ఈడీ,సీబీఐ విచారణలను ఎదురుకున్నఆప్ నేతలు
ఈ ఘటనలపై ఎంపీ సంజీవ్ ఎక్స్ వేదికలో స్పందిస్తూ,"ఈ సోదాలకు గల కారణం నాకు తెలియదు. అయినప్పటికీ, చట్టాన్ని అనుసరించే పౌరుడిగా దర్యాప్తు సంస్థలకు పూర్తిగా సహకరిస్తాను" అని పేర్కొన్నారు.
అలాగే, ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత,ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కేంద్రాన్ని విమర్శించారు.
"మా పార్టీని విచ్ఛిన్నం చేసేందుకే ఇలాంటి దాడులు చేస్తున్నారు.అయితే,ఆప్ నేతలను ఎవరూ ఆపలేరు, కొనలేరు, భయపెట్టలేరు"అని ఆయన బీజేపీను పరోక్షంగా దుయ్యబట్టారు.
ఇటీవల,ఢిల్లీ మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్,మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా సహా చాలా మంది ఆప్ నేతలు ఇప్పటికే ఈడీ,సీబీఐ విచారణలను ఎదుర్కొన్నారు.
ఈ కేసులో ప్రస్తుతం వీరిద్దరూ బెయిల్‌పై విడుదలయ్యారు.