తదుపరి వార్తా కథనం

Dussehra holidays: తెలంగాణలో దసరా సెలవుల షెడ్యూల్‌ను రిలీజ్ చేసిన విద్యాశాఖ
వ్రాసిన వారు
Jayachandra Akuri
Sep 08, 2025
03:10 pm
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ రాష్ట్రంలో దసరా సెలవుల షెడ్యూల్‌ను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు తాజా ఉత్తర్వులు జారీ చేసింది. సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 3 వరకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలకు దసరా సెలవులు అమల్లో ఉంటాయి. అనంతరం అక్టోబర్ 4వ తేదీ నుంచి పాఠశాలలు మళ్లీ ప్రారంభమవుతాయి. జూనియర్ కళాశాలలకు మాత్రం వేరే షెడ్యూల్‌ను అమలు చేస్తున్నారు. సెప్టెంబర్ 28నుంచి అక్టోబర్ 5వరకు దసరా సెలవులు ప్రకటించగా, అక్టోబర్ 6న కళాశాలలు తిరిగి తెరుచుకోనున్నాయి. విద్యాశాఖ ప్రకటన ప్రకారం, ఈ సెలవులు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ విద్యాసంస్థలకు వర్తిస్తాయి. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ షెడ్యూల్‌ను దృష్టిలో ఉంచుకొని తమ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించింది.