PM Modi-Article 370: 'ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్' స్ఫూర్తిని బలపర్చిన సుప్రీంకోర్టు తీర్పు: మోదీ
జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370రద్దు సమర్థిస్తూ సుప్రీంకోర్టు సోమవారం తీర్పు చెప్పింది. ఈ తీర్పు నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 'ది హిందూ'కు ప్రత్యేక వ్యాసాన్ని రాశారు. ఆ వ్యాసం మంగళవారం ప్రచురితమైంది. సుప్రీంకోర్టు తీర్పును ప్రతి మోదీ తన వ్యాసంలో ప్రశంసించారు. భారతీయులు ఎంతో గౌరవించే భారతదేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను సుప్రీంకోర్టు తన తీర్పులో సమర్థించిందన్నారు. 'ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్' స్ఫూర్తిని సుప్రీంకోర్టు తీర్పు బలపర్చిందన్నారు. 2019ఆగస్టు 5న తీసుకున్న నిర్ణయం రాజ్యాంగపరమైన ఏకీకరణను పెంపొందించే లక్ష్యంతో తీసుకున్నదన్నారు. ఆ నిర్ణయం లక్ష్యం విచ్ఛిన్నం కాదని సుప్రీంకోర్టు చెప్పడం పూర్తిగా సమర్థనీయమన్నారు. ఆర్టికల్ 370స్వభావం శాశ్వతం కాదన్న వాస్తవాన్ని సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేసిందని మోదీ అన్నారు.
ఇక జమ్ముకశ్మీర్‌లో హింస, అస్తితరత కనిపించదు: మోదీ
చాలా ఏళ్లుగా నిర్మలమైన లోయలు, మంచుతో కప్పబడిన పర్వతాలకు నెలవైన జమ్ముకశ్మీర్ ఇక అస్తిరత కనిపిందని మోదీ అన్నారు. జమ్ముకశ్మీర్‌లోని కష్టజీవులు, ప్రకృతి ప్రేమికులు, ఆప్యాయతగల ప్రజలు ఎప్పుడూ హింసను ఎదుర్కోవాల్సిన అవసరం లేదన్నారు. తొలి నాళ్లలో జమ్ముకశ్మీర్ విషయంలో స్పష్టమైన వైఖరి తీసుకోకుండా దేశం ద్వంద్వ విధానాన్ని అనుమతించిందని, దాని వల్లే గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయని మోదీ అభిప్రాయపడ్డారు. ద్వంద్వ విధానాల వల్ల జమ్ముకశ్మీర్ పెద్ద బలిపశువుగా మారిందని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ సమైక్యత కోసం ఒక కొత్త ప్రారంభం కావాలనే తాము 370ని రద్దు చేసినట్లు మోదీ పేర్కొన్నారు. ఇన్నాళ్లు జమ్ముకశ్మీర్‌లో నివసించే ప్రజలకు ఘోరమైన ద్రోహం జరిగినట్లు మోదీ అభిప్రాయపడ్డారు.