Nirmala Sitharaman: ఎన్నికల బాండ్ల వివాదం.. నిర్మలా సీతారామన్‌పై కేసు నమోదు ఆదేశాలు
బెంగళూరు తిలక్‌నగర పోలీసులను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌పై కేసు నమోదు చేయాలని చట్టసభ ప్రతినిధుల న్యాయస్థానం ఆదేశించింది. జనాధికార సంఘర్ష పరిషత్‌కు చెందిన ఆదర్శ్ అయ్యర్ అనే వ్యక్తి చేసిన ఫిర్యాదు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల బాండ్ల పేరిట పలువురు పారిశ్రామికవేత్తలను బెదిరించి బీజేపీకి నిధులు సమకూర్చేందుకు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రయత్నించారని ఆదర్శ్ అయ్యర్ తన ఫిర్యాదులో ఆరోపించారు.
విచారణను అక్టోబర్ 10కి వాయిదా వేసిన కోర్టు
ఈ ఫిర్యాదును మొదట తిలక్‌నగర పోలీసులు స్వీకరించలేదు. దీంతో ఆయనే స్వయంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. విచారణను ముగించిన జడ్జి సంతోష్ గజానన హెగ్డే, నిర్మలా సీతారామన్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఆదేశాలను జారీ చేసింది. ఇక తదుపరి విచారణను అక్టోబరు 10కి వాయిదా వేశారు.