Rajayasabha: ఆంధ్రప్రదేశ్ సహా నాలుగు రాష్ట్రాల్లో రాజ్యసభ ఉపఎన్నికలకు ఈసీ షెడ్యూల్
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ సహా నాలుగు రాష్ట్రాల్లో రాజ్యసభ ఉపఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) షెడ్యూల్‌ను విడుదల చేసింది.
ఆంధ్రప్రదేశ్‌లో మూడు స్థానాలు, ఒడిశా, బెంగాల్, హరియాణా రాష్ట్రాల్లో ఒక్కో స్థానానికి ఉపఎన్నికలు జరగనున్నాయి.
డిసెంబర్ 3న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. నామినేషన్ల స్వీకరణకు డిసెంబర్ 10ని తుది గడువుగా నిర్ణయించారు.
నామినేషన్ల పరిశీలన 11న జరుగుతుంది, 13వ తేదీ వరకు ఉపసంహరణకు అవకాశం ఉంటుంది.
డిసెంబర్ 20న ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ జరుగుతుంది, అదే రోజు సాయంత్రం 5గంటల నుంచి లెక్కింపు ప్రారంభం కానుంది.
ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, ఆర్. కృష్ణయ్యల రాజీనామాల కారణంగా ఈ ఉపఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఏపీ సహా 4 రాష్ట్రాల్లో రాజ్యసభ ఉపఎన్నికలు
Election Commission of India releases notification for the 6 vacant seats of Rajya Sabha. Elections will be held on 20th December and results will also be declared on the same day. pic.twitter.com/5EYrfOYY1p
— ANI (@ANI) November 26, 2024