Hyderabad: గ్రేటర్ హైదరాబాద్‌లో విద్యుత్తు వినియోగం రికార్డు స్థాయికి
ఈ వార్తాకథనం ఏంటి
2023లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విద్యుత్తు వినియోగం భారీగా పెరిగింది. వార్షిక సగటు డిమాండ్ 2917 మెగావాట్ల నుంచి 2024లో 3218 మెగావాట్లకు పెరగడం విశేషం.
వృద్ధి కూడా 10.18 శాతంగా నమోదైంది. అలాగే 2024 డిసెంబర్ నాటికి నగరంలో కనెక్షన్ల సంఖ్య 62.92 లక్షలకు చేరుకోగా, 2023లో అది 60.26 లక్షలుగా ఉంది.
ప్రతేడాది రెండు లక్షలకు పైగా కొత్త కనెక్షన్లు వస్తుండటం గమనార్హం.
Details
వేసవి కాలంలో వినియోగం అధికం
విద్యుత్తు వినియోగం ప్రధానంగా మార్చి నుంచి గణనీయంగా పెరుగుతోంది. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో గరిష్ఠ స్థాయిలో వాడకం నమోదవుతోంది.
మార్చిలో వినియోగం 24.52 శాతం పెరుగుదల కనిపించగా, ఏప్రిల్‌లో 19.66 శాతం, మేలో 13.46 శాతం, జులైలో 12.91 శాతం పెరుగుదల రికార్డైంది.
తక్కువ వాడకం ఉన్న జూన్‌తో పోల్చితే ఈ నెలల్లో వినియోగం చాలా ఎక్కువగా ఉంటోంది.
వేసవి గరిష్ఠానికి సిద్ధమైన డిస్కం
గత అనుభవాల ప్రకారం 2024 వేసవికి డిస్కం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది.
గత రెండేళ్లలో 80 నుంచి 90 మిలియన్ యూనిట్ల వినియోగం నమోదుకాగా, ఈసారి సెంచరీ దాటుతుందని అంచనా. 5వేల మెగావాట్ల గరిష్ఠ డిమాండ్ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు.
Details
నిర్లక్ష్యం చేస్తే సిబ్బందిపై చర్యలు
అయితే పనుల వేగం ఆశించినంతగా లేకపోవడంతో ఏకకాలంలో జనవరికల్లా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఎస్‌ఈలపై సీఎండీ హెచ్చరికలు
వినియోగదారుల అవసరాలకు సరిపడే విధంగా ఎస్‌ఈలు సమర్థంగా పనిచేయాలని టీఎస్‌పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ స్పష్టంచేశారు.
వినియోగదారుల ఫిర్యాదులపై సత్వర స్పందన లేకపోతే నిర్లక్ష్యంగా ఉన్న సిబ్బందిపై చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఒక ఏఈకి ఫిర్యాదుల ఆధారంగా మెమో జారీ చేశారు.
వినియోగం గణాంకాలు (2023-2024)
గరిష్ఠ వినియోగం
(ఎంయూ)
2023: 81.39
2024: 90.68
గరిష్ఠ డిమాండ్
(ఎంవీ)
2023: 3756
2024: 4352