Fali S Nariman: సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది కన్నుమూత
ప్రముఖ న్యాయనిపుణుడు,సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఫాలీ నారిమన్ ఈరోజు కన్నుమూశారు. ఆయన వయసు 95. ఫాలి ఎస్ నారిమన్ ప్రసిద్ధ NJAC తీర్పుతో సహా అనేక మైలురాయి కేసులను వాదించారు. అయన ముఖ్యమైన SC AoR అసోసియేషన్ కేసు (ఇది కొలీజియం వ్యవస్థకు దారితీసింది),TMA పై కేసు(ఆర్టికల్ 30 ప్రకారం మైనారిటీ హక్కుల పరిధిపై) మొదలైనవాటిలో కూడా హాజరయ్యారు. జూన్ 1975లో, ఎమర్జెన్సీని ప్రకటించాలన్న ఇందిరా గాంధీ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా అయన నిరసన తెలిపేందుకు భారతదేశ అదనపు సొలిసిటర్ జనరల్ పదవికి రాజీనామా చేశారు. 1991 నుంచి 2010 వరకు బార్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకు ఆయన అధ్యక్షుడిగా పనిచేశారు. 1991లో పద్మభూషణ్, 2007లో పద్మవిభూషణ్ పురస్కారాలు అందుకున్నారు.
"బిఫోర్ మెమరీ ఫేడ్స్" న్యాయ విద్యార్థులకు ఒక గ్రంథం
1999 నుంచి 2005 వరకు రాజ్యసభ ఎంపీగా పనిచేశారు. ఆర్టికల్ 370 కేసులో ఇటీవలి తీర్పుపై నారిమన్ విమర్శలు గుప్పించారు. ఆయన కుమారుడు రోహింటన్ నారిమన్ సీనియర్ న్యాయవాది,సుప్రీంకోర్టు న్యాయమూర్తి. న్యాయ విద్యార్థులు,యువ న్యాయవాదులకు అయన ఆత్మకథ "బిఫోర్ మెమరీ ఫేడ్స్" ఒక గ్రంథం లాంటిది. "ది స్టేట్ ఆఫ్ నేషన్", "గాడ్ సేవ్ ది హానబుల్ సుప్రీం కోర్ట్" అయన ఇతర పుస్తకాలు.