Page Loader
జమ్ముకాశ్మీర్‌లోని కుప్వారాలో ఎన్‌కౌంటర్.. ఒక సైనికుడు మృతి
జమ్ముకాశ్మీర్‌లోని కుప్వారాలో ఎన్‌కౌంటర్.. ఒక సైనికుడు మృతి

జమ్ముకాశ్మీర్‌లోని కుప్వారాలో ఎన్‌కౌంటర్.. ఒక సైనికుడు మృతి

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 27, 2024
11:00 am

ఈ వార్తాకథనం ఏంటి

జమ్ముకశ్మీర్‌లోని కుప్వారాలో ఎన్ కౌంటర్ జరిగింది. భారత సైన్యం, పాక్ సైన్యం మధ్య జరిగిన ఈ భీకరపోరులో ఓ సైనికుడు వీరమరణం పొందాడు. ఈ ఘటనలో ఒక అధికారి సహా మరో నలుగురు సైనికులు గాయపడ్డారు. ఈ ఎన్ కౌంటర్ ఒక ఉగ్రవాది కూడా మృతి చెందినట్లు తెలిసింది. ఇక గాయపడిన భారత సైనికులను ఆర్మీ ఆస్పత్రిలో చేర్పించారు. గత మూడ్రోజుల్లో కుప్వారాలో ఇది రెండవ ఎన్ కౌంటర్ కావడం గమనార్హం.

Details

కొండ ప్రాంతాల్లో తలదాచుకున్న ఉగ్రవాదులు

ఉగ్రవాద కార్యకలాపాల గురించి సమాచారం అందుకున్న భద్రతా దళాలు మచిల్ సెక్టార్‌లోని వర్కింగ్ ఏరియాలో యాంటీ-టెర్రరిస్ట్ ఆపరేషన్ ప్రారంభించాయి . ఈ సమయంలో, నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) సమీపంలో ఉగ్రవాదులతో ఎన్‌కౌంటర్ జరిగింది, ఇక కొండ ప్రాంతాల్లో 40-50 మంది ఉగ్రవాదులు తలదాచుకున్నట్లు సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో వారిని పట్టుకునేందుకు భద్రతా బలగాలు ఈ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున యాంటీ టెర్రరిజం ఆపరేషన్‌ను ప్రారంభించాయి.