
encounter: సుక్మా జిల్లాలో ఎదురుకాల్పులు.. 15 మంది మావోయిస్టులు మృతి
ఈ వార్తాకథనం ఏంటి
దండకారణ్యంలో శనివారం ఉదయం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో భద్రతా బలగాలు మరియు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి.
ఈ ఎదురుకాల్పుల్లో 15 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
స్థానిక గోగుండా కొండపై మావోయిస్టుల కదలికలపై ముందస్తు సమాచారం అందడంతో భద్రతా బలగాలు కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించాయి.
Details
కెర్లపాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన
ఈ నేపథ్యంలో మావోయిస్టులు కాల్పులకు తెగబడగా, పోలీసులు ధీటుగా ప్రతిఘటించి 15 మందిని హతమార్చారు.
కాల్పులు కెర్లపాల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు.
ఈ ఆపరేషన్‌లో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (DRG), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) బలగాలు పాల్గొన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయి.
ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.