
Shopian: జమ్మూ కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం
ఈ వార్తాకథనం ఏంటి
ఆపరేషన్ సిందూర్ పేరుతో నియంత్రణ రేఖ (ఎల్ఓసీ)కు అవతల ఉన్న ఉగ్రవాద శిబిరాలపై భారత్ చర్యలు చేపట్టిన అనంతరం, జమ్ముకశ్మీర్‌లో కూడా ఉగ్రవాద నిర్మూలనకు భద్రతా బలగాలు ఆపరేషన్‌లను వేగవంతం చేశాయి.
ప్రత్యేకించి షోపియన్ సహా వివిధ ప్రాంతాల్లో ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
జమ్మూ కాశ్మీర్‌లోని షోపియన్ జిల్లాలో భద్రతా దళాలు,ఉగ్రవాదుల మధ్య ఓ ఉగ్రతవ్వే ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది.
ఈ ఎన్‌కౌంటర్‌లో లష్కరే తోయిబా కు చెందిన ఉగ్రవాదులు అడవిలో దాక్కుని ఉన్నారని తెలుసుకుని, భద్రతా బలగాలు వారిని చుట్టుముట్టాయి. జరిగిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు మృతి చెందారు.
వివరాలు
భద్రతా బలగాలపై కాల్పులు జరిపిన ఉగ్రవాదులు
దక్షిణ కాశ్మీర్‌లోని షుక్రు కెల్లర్ ప్రాంతంలో ఉగ్రవాదులు తలదాచుకుని ఉన్నారన్న ఖచ్చితమైన సమాచారం ఆధారంగా భద్రతా దళాలు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్‌ను ప్రారంభించాయి.
ఈ ఆపరేషన్ జరుగుతున్న సమయంలో ఉగ్రవాదులు అకస్మాత్తుగా భద్రతా బలగాలపై కాల్పులు జరిపారు.
దీంతో, సైన్యం ప్రతీకారంగా ఎదురు కాల్పులకు దిగింది. ప్రస్తుతం అక్కడ కాల్పులు కొనసాగుతున్నాయని భద్రతా అధికారులు తెలిపారు.