తదుపరి వార్తా కథనం
Encounter: ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో 31 మంది మావోయిస్టులు మృతి
వ్రాసిన వారు
Jayachandra Akuri
Feb 09, 2025
11:14 am
ఈ వార్తాకథనం ఏంటి
ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. బీజాపూర్‌లో భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 31 మంది మావోయిస్టులు మృతి చెందగా, పలువురు గాయపడినట్లు సమాచారం.
బీజాపూర్ నేషనల్ పార్క్‌లో కూంబింగ్ నిర్వహిస్తున్న డీఆర్‌జీ (డిస్ట్రిక్ రిజర్వ్ గార్డ్), ఎస్టీఎఫ్ (స్పెషల్ టాస్క్ ఫోర్స్) దళాలకు మావోయిస్టులు ఎదురుపడ్డారు.
ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తీవ్రమైన కాల్పులు చోటుచేసుకున్నాయి.
తాజా సమాచారం ప్రకారం, కాల్పులు ఇంకా కొనసాగుతున్నట్లు తెలిసింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు.