
Etela rajender: మల్కాజిగిరి నుంచి పోటీ చేస్తా: ఈటల రాజేందర్
ఈ వార్తాకథనం ఏంటి
లోక్‌సభ ఎన్నికల్లో పోటీపై బీజేపీ నేత ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
వచ్చే ఎన్నికల్లో తమకు ఏ పార్టీతో పొత్తు అవసరం లేదని స్పష్టం చేశారు.
అధిష్టానం ఆదేశిస్తే తాను మల్కాజ్‌గిరి నుంచి పోటీచేస్తానని ఈటల పేర్కొన్నారు.
యాదగిరిగుట్టలో బీజేపీ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రలో ఆయన పాల్గొన్నారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేడిగడ్డపై మాట మార్చిందన్నారు.
అంతకుముందు మేడిగడ్డపై సీబీఐ విచారణను కోరిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు ఆ మాటకు కట్టుబడి లేదన్నారు.
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రజలను తప్పుదోవ పట్టించే హామీలు ఇచ్చిందన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై తెలంగాణ ప్రజల్లో భ్రమలు తొలగుతున్నాయన్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మాట్లాడుతున్న ఈటల
మల్కాజ్‌గిరి నుండి ఎంపీగా పోటీ చేయాలని ఉంది - ఈటెల రాజేందర్ pic.twitter.com/3QQEo7qumF
— Telugu Scribe (@TeluguScribe) February 21, 2024