Page Loader
Mahua Moitra: మహువా మోయిత్రాకు బిగుస్తున్న ఉచ్చు.. ఆమె విదేశీ పర్యటనలపై ఆరా తీసే అవకాశం.. 
విదేశీ పర్యటనలపై ఎథిక్స్ ప్యానెల్ ఆరా

Mahua Moitra: మహువా మోయిత్రాకు బిగుస్తున్న ఉచ్చు.. ఆమె విదేశీ పర్యటనలపై ఆరా తీసే అవకాశం.. 

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Oct 27, 2023
12:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమ బెంగాల్ లోక్‌సభ ఎంపీ మహువా మోయిత్రాకు ఉచ్చు బిగుస్తోంది. ఈ మేరకు ఎథిక్స్ ప్యానెల్ కమిటీ ఆమె విదేశీ పర్యటనల వివరాల కోసం ఆరా తీస్తోంది. ఈ క్రమంలోనే కేంద్ర ఐటీ, హోంశాఖలకు కమిటీ లేఖలు రాసింది. మహువా మొయిత్రా లాగిన్‌ల, ఫారిన్ టూర్స్ వివరాల కోసం ఎథిక్స్ కమిటీ ఆయా కేంద్ర మంత్రిత్వ శాఖలకు లేఖ రాసింది. ఇదే సమయంలో పార్లమెంట్ లాగిన్, ప్రయాణ వివరాలను సమర్పించాలని పార్లమెంటరీ ఎథిక్స్ కమిటీ కోరింది. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీకి వ్యతిరేకంగా వచ్చిన "క్యాష్ ఫర్ క్వెరీ"ఫిర్యాదులపై విచారణ ఎథిక్స్ ప్యానెల్ కమిటీ విచారిస్తోంది. ఈ నేపథ్యంలోనే గురువారం తొలి విచారణ పూర్తిచేసింది.అక్టోబర్ 31న తమ ఎదుట హాజరుకావాలని సమన్లు జారీ చేసింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మోయిత్రాపై కేంద్ర ఐటీ, హోంశాఖలకు కమిటీ లేఖలు రాసిన ఎథిక్స్ ప్యానెల్ కమిటీ