
శత్రువులకు కూడా పురందేశ్వరి లాంటి కూతురు పుట్టకూడదు : విజయసాయిరెడ్డి
ఈ వార్తాకథనం ఏంటి
వైసీసీ ఎంపీ విజయసాయిరెడ్డి, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి మధ్య కొంతకాలంగా మాటల యుద్దం జరుగుతున్న విషయం తెలిసిందే.
స్టేట్ బీజేపీ చీఫ్‌గా ఉండి టీడీపీ కోవర్ట్ లా పనిచేస్తున్నారని గతంలో విజయసాయిరెడ్డి విమర్శలు చేశారు.
ఇక ఈడీ, సీబీఐ, ఐటీ కేసుల్లో బెయిల్ పై ఉండి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని విజయసాయిరెడ్డిని పురందేశ్వరి టార్గెట్ చేశారు.
తాజాగా మరోసారి విజయసాయిరెడ్డి, పురందేశ్వరిపై ఘాటు వ్యాఖ్యలు చేశాడు.
ఎన్టీఆర్ సంపాదించుకున్న అధికారాన్ని భర్త, బావతో చేతులతో కలిసి నిర్ధాక్షిణ్యంగా లాగేశావని, ఏం కూతురివమ్మా నీవు అంటూ విజయసాయిరెడ్డి మండిపడ్డాడు.
చివరి రోజుల్లో తండ్రి ఎన్టీఆర్ కు పట్టెడన్నం కూడా పురందేశ్వరి పెట్టలేదని పేర్కొన్నారు.
Details
ఎన్టీఆర్ ను సీట్లో నుంచి లాగేసిన గొప్ప కూతురు పురందేశ్వరి : విజయసాయి రెడ్డి
బావ చంద్రబాబుతో కలిసి ఎన్టీఆర్ ను సీట్లోంచి లాగేసిన గొప్ప కూతురు పురందేశ్వరి అని ఎద్దేవా చేశాడు.
73ఏళ్ల వయస్సులో ఆ పెద్దాయనను ఎంతో బాధపెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ఇక పురందేశ్వరి కులం, కుటంబ రాజకీయాలు చేస్తారని, నదులన్నీ సముద్రంలో కలిసినట్లే, పురందేశ్వరి ఏం చేసినా అందులో స్వార్థ ప్రయోజనాలే ఉంటాయన్నారు.
ఇలాంటి నాయకులు ఉండడం ఆంధ్ర రాష్ట్ర ప్రజల దురదృష్టకరమని విజయసాయిరెడ్డి వెల్లడించారు.
మరీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై పురందేశ్వరి ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.