DK Shivakumar: భగవంతుడు కూడా బెంగళూరు ట్రాఫిక్ ను మార్చలేడు: డీకే శివకుమార్
ఈ వార్తాకథనం ఏంటి
కర్ణాటక రాజధాని బెంగళూరులో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పందించారు.
ఈ సందర్భంగా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.
బెంగళూరులో ట్రాఫిక్, మౌలిక సదుపాయాల సమస్యలు ఎంత తీవ్రమైనవో ప్రస్తావిస్తూ, "ఈ సమస్యలను దేవుడే వచ్చినా పరిష్కరించలేడు" అని ఆయన వ్యాఖ్యానించారు.
గురువారం బెంగళూరు పాలికే కార్యాలయంలో 'నమ్మ రస్తా' అనే అంశంపై జరిగిన సెమినార్, వస్తు-చిత్ర ప్రదర్శనను డీకే శివకుమార్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ,"రెండు లేదా మూడేళ్లలో బెంగళూరును పూర్తిగా మార్చేస్తామనే వాదన యథార్థత నుంచి దూరంగా ఉంటుంది. ఎంతటి శక్తి వచ్చినా అలాంటి భారీ మార్పు సాధ్యం కాదు. కానీ, సరైన ప్రణాళికతో, క్రమబద్ధంగా పనిచేస్తే మార్పు సాధ్యమే" అని అన్నారు.
వివరాలు
సోషల్ మీడియాలో తీవ్ర చర్చ
ఇటీవల నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలు, ఆలస్యమైన మెట్రో విస్తరణ పనులు, తగినంత ప్రజా రవాణా సదుపాయాల లేమి వంటి అంశాలపై కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు పెరిగిపోతున్నాయి.
ఈ నేపథ్యంలో, "ట్రాఫిక్ , మౌలిక సదుపాయాల సమస్యలను ఒక్కసారిగా పరిష్కరించడం అసాధ్యం. కానీ, సముచిత ప్రణాళిక రూపొందించి దశలవారీగా అమలు చేస్తే మార్పు తప్పకుండా వస్తుంది" అని ఆయన వివరించారు.
డీకే శివకుమార్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.