తదుపరి వార్తా కథనం
Gummadi Narsaiah: ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా.. సీఎంను కలవాలని కోరినా అనుమతి లేదు
వ్రాసిన వారు
Jayachandra Akuri
Feb 21, 2025
10:00 am
ఈ వార్తాకథనం ఏంటి
తాను ఐదుసార్లు ఎమ్మెల్యేగా సేవలు అందించానని, ప్రజా సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలియజేయడానికి నాలుగుసార్లు కలవాలని యత్నించినా ఫలితం లేకపోయిందని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ విషయమై ఆయన మాట్లాడిన వీడియో గురువారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
హైదరాబాద్‌లో ఉన్న గుమ్మడి నర్సయ్యను సంప్రదించగా, ''సీఎంను కలవడానికి ఇప్పటివరకు నాలుగు ప్రయత్నాలు చేశానని, అయినా ఫలితం లేకుండా పోయిందన్నారు.
అధికారులు సీఎం వద్దకు వెళ్లేందుకు అనుమతి మాత్రం ఇవ్వడం లేదన్నారు.
సీతారామ ప్రాజెక్టు, పోడు భూములు, చెక్‌డ్యాంలు, ఎత్తిపోతల పథకాల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్నానని చెప్పారు.
అయితే ఇంటి గేటు వద్దే నిలిపివేస్తున్నారని తన ఆవేదనను వ్యక్తం చేశారు.