Page Loader
BJP: బీజేపీలో చేరిన రాధిక ఖేడా, నటుడు శేఖర్ సుమన్ 
బీజేపీలో చేరిన రాధిక ఖేడా, నటుడు శేఖర్ సుమన్

BJP: బీజేపీలో చేరిన రాధిక ఖేడా, నటుడు శేఖర్ సుమన్ 

వ్రాసిన వారు Sirish Praharaju
May 07, 2024
04:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

లోక్‌సభ ఎన్నికల మధ్య కాంగ్రెస్‌ మీడియా మాజీ సమన్వయకర్త రాధికా ఖేరా,నటుడు శేఖర్ సుమన్ ఇద్దరూ మంగళవారం బీజేపీ చేరారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో రాధిక ఖేడా,శేఖర్ సుమన్ పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఛత్తీస్‌గఢ్‌ కాంగ్రెస్‌ కమ్యూనికేషన్‌ విభాగం చైర్మన్‌ సుశీల్‌ ఆనంద్‌ శుక్లాపై తీవ్ర ఆరోపణలు చేస్తూ కాంగ్రెస్‌ జాతీయ మీడియా కోఆర్డినేటర్‌ రాధికా ఖేడా ఆ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సందర్భంగా,రాధిక ఖేరా మాట్లాడుతూ..'నేను రామ్‌లల్లా దర్శనం చేసుకున్నందుకు కాంగ్రెస్‌లోని కొందరు నేతలు నాతో అనుచితంగా ప్రవర్తించారు.కాంగ్రెస్‌ రాముడిని,హిందూ మతాన్ని వ్యతిరేకించే పార్టీ.భాజపా నాకు మద్దతుగా నిలిచింది. కాబట్టే నేను ఈ పార్టీలోకి వచ్చాను. అందుకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు'' అని పేర్కొన్నారు.

Details 

శత్రుఘ్న సిన్హా చేతిలో ఓటమి

అదే సమయంలో రాజకీయాల్లో నటుడు శేఖర్ సుమన్‌కి ఇది సెకండ్ ఇన్నింగ్స్. అతను 2009 లోక్‌సభ ఎన్నికలలో పాట్నా సాహిబ్ స్థానం నుండి కాంగ్రెస్ టిక్కెట్‌పై పోటీ చేసాడు. కాని అతను బిజెపి నాయకుడు శత్రుఘ్న సిన్హా చేతిలో ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. అప్పుడు ఆయనకు 11 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. కాగా సిన్హా దాదాపు 1.67 లక్షల ఓట్ల భారీ తేడాతో ఈ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఆయనకు 57.30 శాతం ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత 2012లో కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు.

Details 

'హిరమండి' వెబ్ సిరీస్‌లో శేఖర్ సుమన్

భాజపాలో చేరిన అనంతరం శేఖర్‌ సుమన్‌ మాట్లాడుతూ.. ఈరోజు నేను ఇక్కడ కూర్చుంటానని నిన్నటి వరకు నాకు తెలియదని, జీవితంలో తెలిసి, తెలియక ఎన్నో సంఘటనలు జరిగాయన్నారు. నేను చాలా సానుకూల దృక్పథంతో ఇక్కడికి వచ్చాను. నన్ను ఇక్కడికి రమ్మని ఆదేశించినందుకు ముందుగా దేవునికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శేఖర్ సుమన్ ,సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో 'హిరమండి' అనే వెబ్ సిరీస్‌లో నటిస్తున్నాడు. ఈ వెబ్ సిరీస్ ఓటిటి ప్లాట్‌ఫారమ్‌లో విడుదలైంది.