1984 anti-Sikh riots:1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులోదోషిగా తేలిన కాంగ్రెస్ మాజీ ఎంపీ
ఈ వార్తాకథనం ఏంటి
1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో కాంగ్రెస్ మాజీ పార్లమెంట్ సభ్యుడు సజ్జన్ కుమార్ దోషిగా తేలినట్లు ఢిల్లీ కోర్టు బుధవారం తీర్పునిచ్చింది.
1984లో సిక్కుల ఊచకోత సమయంలో సరస్వతి విహార్ ప్రాంతంలో జరిగిన రెండు హత్యలకు సజ్జన్ కుమార్ ప్రమేయం ఉన్నట్లు కోర్టు వెల్లడించింది.
ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజా ఈ తీర్పును ఇచ్చారు. ఫిబ్రవరి 18న తుది శిక్ష ప్రకటించనున్నారు. అదే రోజు శిక్షాకాలాన్ని కూడా నిర్ణయిస్తారు.
ఈ కేసులో విచారణ నిమిత్తం సజ్జన్ కుమార్‌ను తీహార్ జైలు నుండి కోర్టుకు హాజరుపరిచారు.
వివరాలు
పంజాబీ బాగ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు
ఈ కేసు 1984 నవంబర్ 1న జస్వంత్ సింగ్, అతని కుమారుడు తరణ్ దీప్ సింగ్ హత్యలకు సంబంధించినది.
మొదట ఈ ఘటనపై పంజాబీ బాగ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
అనంతరం ఈ కేసును ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT)కు అప్పగించారు.
డిసెంబర్ 16, 2021న కోర్టు సజ్జన్ కుమార్‌పై అభియోగాలు మోపింది మరియు అతని ప్రమేయం ఉన్నట్లు తేల్చింది.
వివరాలు
ప్రాసిక్యూషన్ ప్రకారం
1984లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ హత్యకు ప్రతీకారం తీర్చుకునేందుకు భారీ స్థాయిలో సాయుధ గుంపులు రెచ్చిపోయాయి.
వారు దోపిడీలు, హత్యలు, సిక్కులపై దాడులు నిర్వహించారని ఆరోపించారు.
జస్వంత్ సింగ్ భార్య ఫిర్యాదు ప్రకారం, దుండగులు అమె ఇంటిపై దాడి చేసి భర్త, కుమారుడిని హత్య చేశారు.
ఇంట్లో ఉన్న సామగ్రిని దోచుకుని, ఇంటిని తగలబెట్టారని తెలిపింది.
కోర్టు విచారణలో సజ్జన్ కుమార్ కేవలం ఈ ఘాతుకాలకు భాగస్వామి మాత్రమే కాకుండా, ఆ గుంపుకు నాయకత్వం వహించినట్లు ఆధారాలు లభించాయని స్పష్టంగా పేర్కొంది.