NTA: పరీక్షల్లో అవకతవకలు.. ఎన్‌టీఏలో 50 మందికి పైగా సిబ్బందిపై వేటు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రశ్నపత్రాల లీకేజీ, పరీక్షల నిర్వహణలో అవకతవకలపై కొద్ది రోజులుగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో జాతీయ పరీక్షల ఏజెన్సీ (NTA) కీలక చర్యలకు శ్రీకారం చుట్టింది. పరీక్షా నిర్వహణ వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసే ప్రక్రియలో భాగంగా 50 మందికి పైగా సిబ్బందిని తొలగించింది. అదే సమయంలో సంస్థలోని కీలక స్థానాల్లో నిపుణులను నియమించేందుకు చర్యలు చేపడుతోంది. ఈ విషయాన్ని కేంద్ర విద్యాశాఖ ప్రకటించింది. చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (CTO),చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ (CFO) సహా పది కొత్త కీలక పోస్టుల భర్తీకి ప్రకటనలు జారీ చేసి,నియామక ప్రక్రియను ప్రారంభించనున్నట్లు వెల్లడించింది.
వివరాలు
ప్రోటోకాల్స్‌ను కచ్చితంగా పాటించాలి
సైబర్ భద్రత, సైకోమెట్రిక్స్, ప్రశ్నపత్రాల రూపకల్పనతో పాటు ఇతర ప్రత్యేక విభాగాల్లో ప్రైవేట్ రంగానికి చెందిన నిపుణుల సేవలను కూడా వినియోగించనున్నట్లు తెలిపింది.
పరీక్షల నిర్వహణకు నిర్దేశించిన విధివిధానాలను (Protocols) ఎలాంటి మినహాయింపులు లేకుండా కచ్చితంగా అమలు చేయాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అధికారులను ఆదేశించారు.
ముఖ్యంగా ప్రశ్నపత్రాల గోప్యతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
ఇందుకోసం ప్రత్యేక గదులు (Secluded Rooms), ఇంటర్నెట్‌తో ఎలాంటి సంబంధం లేని ఎయిర్-గ్యాప్డ్ సిస్టమ్స్, పరికరాల భద్రతకు సంబంధించిన విధానాలను పూర్తిగా పునర్‌వ్యవస్థీకరించాలని ఆదేశించారు.
వివరాలు
ప్రోటోకాల్స్‌ను కచ్చితంగా పాటించాలి
అన్ని పరీక్షా ప్రక్రియలపై సమగ్ర ఆడిట్ నిర్వహించి, దానికి సంబంధించిన నివేదికను సమర్పించాలని ఎన్‌టీఏను కేంద్రం ఆదేశించింది.
సోమవారం కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎన్‌టీఏ డైరెక్టర్ జనరల్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.
ఈ సమావేశం అనంతరం ఎన్‌టీఏలో చేపట్టనున్న ప్రక్షాళనకు సంబంధించిన వివరాలను కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది.
వివరాలు
యూజీసీ నెట్ పరీక్షలపైనా ప్రభావం
నీట్ ప్రశ్నపత్రాల లీకేజీకి వ్యతిరేకంగా ఇటీవల దిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలో ఆందోళన జరిగిన విషయం తెలిసిందే.
దేశవ్యాప్తంగా వేలాది మంది యువతతో పాటు ప్రతిపక్షాలు కూడా ఈ నిరసనల్లో పాల్గొన్నాయి. ఈ నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు.
ఇదిలా ఉండగా, ప్రశ్నపత్రాల్లో పలు తప్పులు దొర్లాయంటూ వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో యూజీసీ నెట్ (UGC-NET)లో ఇంగ్లిష్, కామర్స్, సోషియాలజీ సబ్జెక్టులకు మరోసారి పరీక్షలు నిర్వహించనున్నట్లు ఎన్‌టీఏ ఆదివారం ప్రకటించింది.
ఆ ప్రకటన వెలువడిన మరుసటి రోజే ఏజెన్సీలో పెద్దఎత్తున ప్రక్షాళన చర్యలు చేపట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది.