
Kishan Reddy : తెలంగాణలో జాతీయ రహదారుల విస్తరణ.. లక్ష కోట్లతో ఐదు కారిడార్ ప్రాజెక్టులు
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్ర ప్రభుత్వం మౌలిక వసతుల అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. గత దశాబ్దంలో దేశంలో జాతీయ రహదారుల నిర్మాణం వేగంగా జరిగిందని చెప్పారు.
అన్ని రాష్ట్రాల రాజధానులను జాతీయ రహదారులతో అనుసంధించేందుకు కేంద్రం కృషి చేస్తోందని వివరించారు. తెలంగాణలో ఈ అభివృద్ధి దశాబ్ద కాలంలో స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొన్నారు.
2014లో రాష్ట్రంలో కేవలం 2,500 కిలోమీటర్ల జాతీయ రహదారులుండగా, ప్రస్తుతం వాటి పొడవు 5,200 కిలోమీటర్లకు పెరిగిందని వెల్లడించారు.
ఈ విస్తరణ 32 జిల్లాల కేంద్రాలను జాతీయ రహదారులతో అనుసంధించేందుకు దోహదపడిందని చెప్పారు.
Details
6 లైన్లుగా విస్తరణ
హైదరాబాద్-శ్రీశైలం రోడ్డును అభివృద్ధి చేయడం వల్ల ప్రయాణ దూరం తగ్గుతుందని, అలాగే హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిని 6 లేన్లుగా విస్తరిస్తున్నట్లు చెప్పారు.
కొన్ని ప్రాంతాల్లో భూసేకరణ సమస్యలు ఎదురవుతున్నాయని, భూసేకరణ ఆలస్యం అయితే నిర్మాణ పనులు ఆలస్యమవుతాయని తెలిపారు.
భూములు త్వరగా సమకూరితే రహదారుల పనులు వేగంగా పూర్తవుతాయని స్పష్టం చేశారు. తెలంగాణలో వేలాది కోట్ల రూపాయలతో వందల కిలోమీటర్ల రహదారులు నిర్మాణంలో ఉన్నాయని చెప్పారు.
Details
లక్ష కోట్లలో ఖర్చు
రాష్ట్రానికి సంబంధించిన ఐదు ప్రధాన కారిడార్ల అభివృద్ధికి కేంద్రం సుమారు రూ. లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని పేర్కొన్నారు.
ఈ నెల 5న కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలంగాణకు రానున్నారని తెలిపారు. ఆయన అదిలాబాద్, హైదరాబాద్‌లలో నిర్వహించనున్న కార్యక్రమాల్లో పాల్గొంటారని చెప్పారు.
ఈ సందర్భంగా రూ.5,416 కోట్ల విలువైన 26 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు.
ఈ ప్రాజెక్టులు తెలంగాణలో మౌలిక వసతుల అభివృద్ధిని మరింత వేగవంతం చేస్తాయని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.