కేరళలో నిఫా వైరస్ వ్యాప్తి.. గబ్బిలాలు, చెట్ల నుంచి నమూనాలను సేకరిస్తున్న నిపుణులు
కేరళలో నిఫా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. దీంతో వైరస్‌కు అడ్డుకట్టే వేసేందుకు రాష్ట్రంతో పాటు కేంద్ర బృందాలు కూడా తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఈ క్రమంలో వైరస్ వ్యాప్తికి గల కారణాలు ఏంటి అనే విషయాలను తెలుసుకునే పనిలో ఆరోగ్యశాఖ నిపుణులు ఉన్నారు. ఆధారాలను సేకరించే పనిలో భాగంగా కోజికోడ్ జిల్లాలో నిఫా వైరస్ సోకి మరణించిన 47 ఏళ్ల వ్యక్తి ఇంటి పరిసరాలను పరిశీలించారు. ఇంటి సమీపంలోని వ్యవసాయ భూమిలో గబ్బిలాలు ఎక్కువగా కనిపించే అరటి మొక్కలు, అరటి మొక్కలు ఉన్నట్లు ఆరోగ్యశాఖ అధికారులు చెప్పారు. కోజికోడ్ జిల్లాలో వైరస్ వ్యాప్తికి గల కారణాలపై అన్ని రకాల ఆధారాలను ప్రభుత్వానికి అందిస్తునట్లు తెలిపారు.
కోజికోడ్ జిల్లాలో మరో వ్యక్తికి నిఫా వైరస్ నిర్ధారణ
ఆ 47 ఏళ్ల వ్యక్తికి వైరస్ ఎలా సోకిందనే విషయం మాత్రం కేంద్ర బృందం దర్యాప్తు పూర్తయిన తర్వాతే కచ్చితమైన సమాచారం తెలియనుంది. పండ్లు, గబ్బిలాలు నిఫా వైరస్ సహజమైన వాహకాలుగా నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా వైరస్ సోకిన జంతువుల శరీర ద్రవాల ద్వారా కూడా వ్యాప్తి చెందుతుంది. ప్రస్తుతం కేరళలో ఉనికిలో ఉన్న నిఫా వైరస్ బంగ్లాదేశ్ వేరియంట్‌గా చెబుతున్నారు. ఈ వైరస్ మనిషి నుంచి మనిషికి వేగంగా వ్యాప్తి చెందుతుందని ఆరోగ్య అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే, కోజికోడ్ జిల్లాలో మరో నిపా వైరస్ పాజిటివ్ కేసు నిర్ధారణ అయ్యింది. తాజాగా 39 ఏళ్ల వ్యక్తికి వైరస్ సోకింది. దీంతో రాష్ట్రంలో మొత్తం సంఖ్య ఆరుకు చేరుకుంది.