LOADING...
తమిళనాడు బాణాసంచా గోదాములో భారీ పేలుడు.. ఎనిమిది మంది మృతి
తమిళనాడు బాణాసంచా గోదాములో భారీ పేలుడు.. ఐదుగురు మృతి

తమిళనాడు బాణాసంచా గోదాములో భారీ పేలుడు.. ఎనిమిది మంది మృతి

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 29, 2023
03:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

తమిళనాడు కృష్ణగిరి ప్రాంతంలో శనివారం ఉదయం బాణసంచా గోదాంలో భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది చనిపోగా .. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు.పేలుడు ధాటికి గోడౌన్ బిల్డింగ్ తో సహా చుట్టుపక్కల మరో ఐదు ఇళ్లు నేలమట్టమయ్యాయి. పేలుడు సమాచారమందుకున్న పోలీసుల, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు ముమ్మరం చేశారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. బిల్డింగ్ శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం వెతుకుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

తమిళనాడు బాణాసంచా గోదాములో భారీ పేలుడు