Page Loader
ప్రియుడి ఘాతుకం: బెంగళూరులో కాకినాడ యువతి దారుణ హత్య
బెంగళూరులో కాకినాడ యువతి దారుణ హత్య

ప్రియుడి ఘాతుకం: బెంగళూరులో కాకినాడ యువతి దారుణ హత్య

వ్రాసిన వారు Stalin
Mar 01, 2023
03:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

బెంగళూరులో ఓ యువతి వ్యక్తి చేతిలో దారుణ హత్యకు గురైంది. మృతురాలిని ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడకు చెందిన లీలా పవిత్ర నీలమణి (25)గా పోలీసులు గుర్తించారు. ఘటన అనంతరం పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. లీలా పవిత్ర ఓ కంపెనీలో పనిచేస్తోంది. ఆమె విధులు ముగించుకుని మంగళవారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో కార్యాలయం నుంచి బయటకు వచ్చింది. అప్పటికే ఆమె కోసం వేచి చూస్తున్న దినకర్ బాణాల(28) పవిత్రపై దాదాపు 15సార్లు కత్తితో దాడి చేశాడు. తీవ్రగాయాలతో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

బెంగళూరు

ఐదేళ్లుగా ప్రేమ వ్యవహారం, పెళ్లికి ఒప్పుకోని పెద్దలు

లీలా పవిత్ర, దినకర్ గత ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. కొన్ని నెలల తర్వాత వీరిద్దరు పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నప్పటికీ కుల విభేదాల కారణంగా కుటుంబ సభ్యులు వ్యతిరేకించారు. ఆ తర్వాత లీలా పవిత్ర దినకర్‌ను దూరంగా ఉంచింది. అలాగే దినకర్ పలుమార్లు ఫోన్ చేసేందుకు ప్రయత్నించగా ఆమె స్పందించలేదు. దీంతో కోపోద్రిక్తుడైన దినకర్ కత్తితో కార్యాలయం వద్దకు వచ్చి విచక్షణారహితంగా దాడి చేశాడు. యువతి అక్కడికక్కడే మృతి చెందింది. జీవన్ బీమానగర్ పోలీసులు దినకర్‌పై హత్య కేసు నమోదు చేశారు.