పట్టపగలు, కత్తులతో నడిరోడ్డుపై వ్యక్తి దారుణ హత్య
ఈ వార్తాకథనం ఏంటి
నిత్యం రద్దీగా ఉండే ఓ ప్రాంతంలో పట్టపగలు 26ఏళ్ల యువకుడిని దారుణంగా నరికి చంపారు. కర్ణాటక బీదర్ జిల్లాలోని త్రిపురాంత్ గ్రామంలో ఈ హత్య జరిగింది. హత్య దృశ్యాలు స్థానిక సీసీటీవీలో రికార్డయ్యాయి.
నలుగురైదుగురు వ్యక్తులు కత్తులు, ఇతర పదునైన ఆయుధాలతో రద్దీగా ఉండే కూడలిలో ఆనంద్ ఫూలేపై దాడి చేశారు. అయితే హత్య జరిగిన ప్రాంతంలో చాలా మంది ఉన్నా, ఎవరూ ఆపేందుకు ప్రయత్నించలేదు.
విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
హత్య
హత్యకు పాత కక్ష్యలే కారణం: పోలీసులు
ఆనంద్ ఫూలే హత్యకు పాత కక్షలే కారణమని పోలీసులు చెబుతున్నారు. పక్కా ప్రణాళికతోనే ఈ హత్య చేశారని పేర్కొన్నారు. నిందితుల కోసం తమ బృందాలు గాలిస్తున్నాయని, త్వరలోనే వారిని అరెస్టు చేస్తామని పోలీసులు ప్రకటించారు.
పూలే స్నేహితుడు కూడా దాడిలో గాయపడి ప్రస్తుతం బీదర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
పూలే స్నేహితుడి నుంచి అందిన సమాచారం మేరకు నిందితులను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.