TG 10th Public Exams Fee: తెలంగాణలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు ఫీజు గడువు పెంపు
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును విద్యాశాఖ మరోసారి పొడిగించింది.
రూ. వెయ్యి ఆలస్య రుసుంతో జనవరి 22 వరకు రెగ్యులర్, ప్రైవేట్ విద్యార్థులు తమ ఫీజు చెల్లించాలని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ ఓ ప్రకటనలో తెలిపారు.
ఇది చివరి అవకాశం కావడంతో ఫీజు చెల్లించని విద్యార్థులు వెంటనే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. ఫీజు చెల్లించని విద్యార్థులకు పరీక్షలు రాయడానికి అనుమతి ఇవ్వమని చెప్పారు.
2024లో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 21 నుండి ప్రారంభం కానున్నాయి. ఇందులో 80 శాతం మార్కులు సాధారణ పరీక్షలలో రాయనున్నారు.
Details
ప్రాక్టికల్ లో 20శాతం మార్కులు
20 శాతం మార్కులు ప్రాక్టికల్ పరీక్షలలో కలిపి ఇచ్చే అవకాశం ఉంది. 2025 నుండి ఈ పరీక్షలు 100 మార్కులకు మారనుంది.
2025 పదో తరగతి పరీక్షల షెడ్యూల్
మార్చి 21: ఫస్ట్ లాంగ్వేజ్ పరీక్ష
మార్చి 22: సెకెండ్ లాంగ్వేజ్
మార్చి 24: ఇంగ్లీష్
మార్చి 26: మ్యాథ్స్ మార్చి
28: ఫిజికల్ సైన్స్ మార్చి
29: బయోలాజికల్ సైన్స్
ఏప్రిల్ 2: సోషల్ స్టడీస్